AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ వాడుతున్నారా? సాఫ్ట్‌వేర్‌‌ అప్‌డేట్‌పై నిపుణుల హెచ్చరిక ఏంటో తెలుసా

OnePlus 12.. లక్షల రూపాయలు పెట్టి కొన్న ఫోన్ ఒక్క సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో పూర్తిగా డెడ్ అయిపోతే ఆవేదన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ 12 యూజర్లను సరిగ్గా ఇదే ఆందోళన వెంటాడుతోంది. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన తర్వాత ఫోన్ పనితీరు మెరుగుపడాల్సింది పోయి, ఏకంగా మదర్‌బోర్డ్ ఫెయిలై ఫోన్లు ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండానే పనిచేయకుండాపోతున్నాయనే ఫిర్యాదులు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ వాడుతున్నారా? సాఫ్ట్‌వేర్‌‌ అప్‌డేట్‌పై నిపుణుల హెచ్చరిక ఏంటో తెలుసా
Oneplus 12
Nikhil
|

Updated on: Aug 18, 2026 | 7:20 AM

Share

వన్‌ప్లస్ 12 ఫోన్లలో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత మదర్‌బోర్డులు పాడైపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అప్‌డేట్ చేసిన వెంటనే ఫోన్లు డెడ్ అవుతుండటంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు కంపెనీ స్పష్టతనిచ్చే వరకు ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ను నిలిపివేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిణామంతో టెక్ ప్రియులు, ముఖ్యంగా వన్‌ప్లస్ యూజర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్‌డేట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో, ఈ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అప్‌డేట్‌తో మదర్‌బోర్డ్ ఫెయిల్..

ప్రముఖ టెక్ టిప్‌స్టర్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా మార్కెట్లో చర్చ మొదలైంది. వన్‌ప్లస్ 12 మోడల్‌లో రీసెంట్‌గా అప్‌డేట్ చేసిన తర్వాత మదర్‌బోర్డులు పాడైపోతున్న కేసులు వేగంగా పెరుగుతున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వార్త బయటకు రాగానే చాలామంది బాధితులు తమ చేదు అనుభవాలను ఆన్‌లైన్ వేదికగా పంచుకున్నారు. అప్‌డేట్ చేసిన క్షణాల్లోనే లేదా ఛార్జింగ్ పెట్టిన సమయంలో తమ ఫోన్ పూర్తిగా ఆగిపోయిందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వీస్ సెంటర్లకు వెళ్తే ఎలాంటి భౌతిక లేదా నీటి నష్టం జరగకపోయినా మదర్‌బోర్డ్ పోయిందని చెప్పి భారీగా రిపేర్ ఖర్చులు మళ్లీ చెల్లించమంటున్నారని యూజర్లు వాపోతున్నారు. అయితే ఈ సమస్య కేవలం వన్‌ప్లస్ 12కే పరిమితమని, వన్‌ప్లస్ 13 యూజర్లు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని తెలుస్తోంది. కానీ ఇతర బ్రాండ్లకు చెందిన కొన్ని మోడళ్ల వినియోగదారులు కూడా అప్‌డేట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

భద్రతా చర్యలు

మీ చేతిలోని ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్స్, అప్‌డేట్స్‌ను వెంటనే ఆఫ్ చేయండి. ఇది మీ ఫోన్ అకస్మాత్తుగా డెడ్ అవ్వకుండా కాపాడుతుంది. కంపెనీ అధికారికంగా స్పందించి, ఈ బగ్‌ను సరిచేసే వరకు ఎలాంటి కొత్త అప్‌డేట్ల జోలికి వెళ్లకుండా ఉండటమే ప్రస్తుతం అత్యంత తెలివైన పని. ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా తొందరపడి ఇన్‌స్టాల్ చేయకుండా కొద్దిరోజులు వేచి చూడటం మంచిది.

Follow Us