August 18, 2026
Subhash
ప్రెజర్ కుక్కర్ వాడేటప్పుడు నీరు లేదా పప్పు విజిల్ నుండి బయటకు వచ్చి పొంగిపోవడం చాలామంది ఎదుర్కొనే పెద్ద సమస్య. దీనివల్ల పొయ్యి అంతా మురికిగా మారుతుంది.
కుక్కర్ మూత రబ్బర్ (Gasket) వదులైపోయినా లేదా విరిగిపోయినా నీరు లీక్ అవుతుంది. విజిల్ వేయడానికి ముందే గ్యాస్కెట్ సరిగ్గా ఉందో లేదో చూడండి. అవసరమైతే కొత్తది మార్చండి.
కుక్కర్ మూతపై ఉన్న విజిల్ ట్యూబ్‌లో ఆహార పదార్థాలు లేదా పప్పు చిన్న ముక్కలు పేరుకుపోతే ప్రెజర్ సరిగ్గా రాక నీరు లీక్ అవుతుంది. పిన్‌తో శుభ్రం చేయండి.
పప్పు లేదా బియ్యం ఉడికించేటప్పుడు కుక్కర్‌లో కొన్ని చుక్కల నూనె లేదా నెయ్యి వేయండి. ఇది నురుగు రాకుండా తక్కువ చేసి, నీరు పైకి పొంగకుండా నిరోధిస్తుంది.
కుక్కర్‌ను ఎప్పుడూ నిండుగా నింపకూడదు. సగానికి కంటే కొద్దిగా ఎక్కువ మాత్రమే పదార్థాలు, నీరు ఉండాలి. ప్రెజర్ పెరగడానికి కావలసినంత ఖాళీ స్థలం ఉండటం ముఖ్యం.
కుక్కర్ పొయ్యిపై పెట్టగానే మంటను అతిగా (High Flame) ఉంచకూడదు. మొదట మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి మంటను తగ్గించాలి.
కుక్కర్ ఉపయోగించడానికి 10-15 నిమిషాల ముందు గ్యాస్కెట్‌ను చల్లటి నీటిలో లేదా ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల రబ్బర్ బిగుతుగా మారి నీరు బయటకు రాదు.
ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీ కుక్కర్ నీరు లీక్ అవ్వకుండా శుభ్రంగా ఉంటుంది. అలాగే వంట కూడా వేగంగా పూర్తవుతుంది.