Fuel Prices: పెట్రోల్ ధర ఎన్డీయే, ఇండీ కూటమి పాలిత రాష్ట్రాల్లో ఎలా ఉందంటే..? అక్కడే ఎక్కువ..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ధరలు తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ యుద్దాలు, హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అన్ని దేశాల్లో ధరలు భారీగా పెరిగాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ప్రజలపై భారం మోపకుండా చూస్తోంది.

హర్ముజ్ జలసంధి మూసివేత, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వంటి అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో భారత్‌లో కేంద్ర ప్రభుత్వం 78 రోజుల పాటు ఇంధన ధరలను పెంచకుండా భారం భరించింది. అనంతరం మే 15, 19, 23, 25 తేదీల్లో నాలుగు విడతలుగా మాత్రమే పెంపు చేపట్టగా.. లీటర్‌కు రూ.7 వరకు పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.94.77 నుంచి రూ.102.12కి, డీజిల్ రూ.87.67 నుంచి రూ.95.20కి చేరుకుంది.

Petrol Rates

Petrol Rates Other Countries
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధరలు తక్కువ..
ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంధన ధరలు 20 శాతం నుంచి 90 శాతం వరకు పెరిగాయి. కానీ భారత్‌లో మాత్రం పెరుగుదల 8శాతంలోపే ఉంది. యూరప్ దేశాల్లో పెట్రోల్ ధరలు రూ.180 నుంచి రూ.230 వరకు ఉండగా.. భారత్‌లో రూ.102 వద్ద మాత్రమే ఉన్నాయి. భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకల్లో కూడా ధరలు భారత్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా ధరలు మారుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌లు. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండగా.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. డీజిల్‌పై తెలంగాణ, కేరళల్లో అధిక వ్యాట్ విధిస్తున్నారు. దీని వల్ల రైతులు, రవాణా రంగంపై భారం ఎక్కువగా పడుతోంది. 2021 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వినియోగదారులకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. 2021, 2022, 2024, 2025, 2026లో ధరలను తగ్గించేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సుంకాలను తగ్గిస్తూ వస్తోంది. 2026 మార్చి 27న డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని జీరోకు పరిమితం చేయగా.. పెట్రోల్‌పై స్వల్ప మొత్తంలో మాత్రమే ఉంది.

Petrol Prices
వినియోగదారులపై భారం పడకుండా..
యూపీఏ ప్రభుత్వ కాలంలో జారీ చేసిన ఆయిల్ బాండ్ల కారణంగా అప్పటి తక్కువ ధరలు భవిష్యత్తుకు భారంగా మారాయి. ప్రస్తుతం కేంద్రం వాటి రుణాలను చెల్లిస్తోంది. ఇప్పటివరకు రూ.1.30 లక్షల కోట్లకుపైగా ఆయిల్ బాండ్ ప్రిన్సిపల్‌ను చెల్లించింది. ప్రపంచ ఇంధన సంక్షోభాల సమయంలో కూడా భారత్‌లో ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. వినియోగదారులపై పూర్తి భారం మోపకుండా నష్టాలను ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ధరలు స్వల్పంగానే పెరగడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
