Gold: దేశంలోని ఈ సిటీల్లో అత్యంత చవక ధరకే బంగారం.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో కూడా రేటు తక్కువ..
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు వారాలుగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోల్‌సేల్ ధరలకే గోల్డ రేట్లు లభిస్తున్నాయి. అతి తక్కువ ధరకే ఇక్కడ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఎంతకొంత గోల్డ్ అనేది ఉంటుంది. పండుగలు, పంక్షన్ల సమయంలో వీటిని ధరించి సంతోషపడుతుంటారు. బంగారాన్ని దేశ ప్రజలు ఒక ఆభరణంగానే కాకుండా ఒక ఆస్తిగా పరిగణిస్తారు. దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు గోల్డ్‌ను విక్రయించి తమ ఆర్దిక అవసరాలను తీర్చుకుంటారు. దేశంలో గత రెండేళ్ల కాలంలో ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త తగ్గగా.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ద ప్రభావంతో మళ్లీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. అయితే ఇక్కడ ధరలు ఎక్కువగా ఉండటంతో దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల నుంచి కొంతమంది తెప్పించుకుంటూ ఉంటారు.
అయితే ఇండియాలో కూడా కొన్ని ప్రదేశాల్లో బంగారం తక్కువ ధరకు లభిస్తోంది. ముంబైలోని జవేరి బజార్ బంగారం కొనుగోళ్లకు అతిపెద్ద వ్యాపారం కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడ హోల్ సేల్ ధరకే గోల్డ్ విక్రయిస్తుంటారు. పెళ్లి షాపింగ్ నుంచి వివిధ డిజైన్ల బంగారం ఇక్కడ హోల్ సేల్ రేట్లకు కొనుగోలు చేయవచ్చు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కూచా మహాజని ప్రాంతం కూడా బంగారం విక్రయాలకు బాగా పాపులర్ అని చెప్పవచ్చు. ఇక్కడ కుందన్ వర్క్ నగలతో పాటు గ్రాండ్ బ్రైడల్ జ్యూవెలరీ లభిస్తుంది. ఇక జైపూర్‌లోని వోహరి బజార్, కోల్‌కత్తాలోని బో జనార్, బుర్రా బజార్ కూడా బాగా ఫేమస్. జోహరి బజార్ కుందన్, మీనాకారి ఆభరణాలకు పాపులర్ కాగా.. బో జజార్ బెంగాలీ ఫిలిగ్రీ వర్క్‌కు ప్రసిద్ది పొందింది. ఇక దక్షిణ భారతదేశం విషయానికొస్తే.. చెన్నైలోని జార్జ్ టౌన్ బంగారం విక్రయాలకు పెద్ద మార్కెట్‌గా ఉంది. సాంప్రదాయ టెంపుల్, యాంటిక్ నగలకు ఈ ప్రాంతం పేట్టింది పేరు.
ఇక కోయంబత్తూరు కూడ గోల్డ్ షాపింగ్‌కు పాపులర్ ప్రదేశంగా చెప్పవచ్చు. మెషిన్ చైన్లు, తేలికపాట నగల తయారీకి ఇది ముఖ్యమైన కేంద్రంగా చెప్పవచ్చు. ఇక హైదరాబాద్‌లోని బేగం బజార్, పాట్ మార్కెట్లో కూడా బంగారం తక్కువ ధరకు లభిస్తుంది. హోల్ సేల్ రేట్లకు ఇక్కడ గోల్డ్ దొరుకుతోంది. ఇక కేరళలోని త్రిశూల్ ప్రాంతం, గుజరాత్‌లోని మానెక్ చౌక్ దేశంలో హోల్ సేల్ రేట్లకు బంగారం దొరికే అతిపెద్ద కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గోల్డ్ బార్స్, కాయిన్స్, బిస్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రాంతాల్లో మేకింగ్, తరుగు వంటి ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. రిలైట్ షోరూమ్‌లతో పోలిస్తే 30 శాతం నుంచి 50 శాతం వరకు తక్కువగా ఉంటాయి.
