మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం మాటేడు గ్రామంలో 16 ఎకరాల మామిడి తోట అగ్నికి ఆహుతైంది. పక్క పొలాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడంతో చెలరేగిన మంటలు మామిడి తోటను చుట్టుముట్టాయి. 16 ఏళ్లుగా పెంచుకున్న తోట కాలిపోవడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అధికారుల అవగాహన కార్యక్రమాల ఆవశ్యకతను ఈ ఘటన చాటింది.