Vitamin B12: ఈ విటమిన్ లోపం ఉంటే సమస్యల ఊబిలో పడినట్లే.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే సంగతీ.. మరి సమస్యకు చెక్ పెట్టేయండిలా..

ప్రస్తుత కాలంలో మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా శరీరానికి కావలసిన స్థాయిలో విటమిన్లు అందడం లేదు. ఫలితంగా శరీరంలో విటమిన్ల లోపం..ప

Vitamin B12: ఈ విటమిన్ లోపం ఉంటే సమస్యల ఊబిలో పడినట్లే.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే సంగతీ.. మరి సమస్యకు చెక్ పెట్టేయండిలా..
Diet To Overcome Vitamin B12 Deficiency
Follow us

|

Updated on: Jan 31, 2023 | 10:00 AM

మనం నిత్యం ఆరోగ్యంగా .. ఉత్సాహంగా ఉండటానికి పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక వీటిలో విటమిన్ల పాత్ర ప్రముఖమైనదని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుత కాలంలో మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా శరీరానికి కావలసిన స్థాయిలో విటమిన్లు అందడం లేదు. ఫలితంగా శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడుతుంది. ఇలా జరగడం వల్ల మన శరీరం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన శరీరానికి ఉపయోగకరంగా ఉండే సీ, డీ, ఈ, బీ12 విటమిన్లలో ఏది లోపించిన అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందులో ముక్యంగా బీ12 విటమిన్ లోపం వలన అలసట, మతిమరుపు, కండరాలలో జలదరింపు, తిమ్మిర్లు, నాలుక రుచి కోల్పోవడం, కంటి చూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, జీర్ణక్రియ సమస్యలు, చర్మం పాలిపోవడం.. వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాగే విటమిన్ బీ12 లోపం వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, రక్తహీనత, అట్రోఫిక్ వలన కడుపులో పుండ్లు, క్రోన్స్ వ్యాధి, ఆల్కహాల్ ఎక్కువగా తాగలనిపించడం.. వంటి సమస్యల బారిన పడే ప్రమాదముంది. అందుకే శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని మనకు ఎక్కువగా ఆహారం నుంచే లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ.. చాలా మంది సహజ వనరులను తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంతో పాటు… కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ విటమిన్ బీ12 లోపాన్ని జయించవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. సాల్మన్ చేపలు: సాల్మన్ చేపలలో బీ విటమిన్, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన బీ12 విటమిన్ లోపాన్ని అధిగమించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయి.
  2. గుడ్లు: గుడ్లు ఆరోగ్యానికి మంచివని అందరికి తెలిసిన విషయమే. రోజూ వీటిని తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు.. వీటిలో విటమిన్ బీ12, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ 12 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ట్యూనా చేపలు: ట్యూనా చేపలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ట్యూనా చేపలు విటమిన్ 12 కు మంచి మూలం. ఇది సుమారు 100 గ్రాముల వరకు జీవరాశి 10.9mcg విటమిన్ 12 అందిస్తుంది. ఇది ప్రోటీన్ ఆహారానికి ముఖ్యమైన మూలం.
  5. మాంసం: మాంసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంటే చికెన్, మటన్ వంటి మాంసాలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఇందులో కాలేయం, కిడ్నీలలో అధికంగా పోషకాలు, విటమిన్లు ఉంటాయి. అయితే మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. అందుకే మాంసాన్ని మితంగా తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.