AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Diet: మధుమేహంతో బాధపడేవారు ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు.. కంట్రోల్ చేస్తుంది..

వైట్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు ఈ అన్నాన్ని రోజూ తినకూడదు. అయితే ఇలాంటి సమయంలో ఏ రైస్ తింటే మంచిదంటే..

Diabetic Diet: మధుమేహంతో బాధపడేవారు ఈ అన్నం తింటే షుగర్ అస్సలు పెరగదు.. కంట్రోల్ చేస్తుంది..
Sama Rice
Sanjay Kasula
|

Updated on: Jan 31, 2023 | 10:29 AM

Share

మధుమేహం వచ్చింది అన్న రోజులు నుంచి ముందుగా ఆందోళన మొదలవుతంది. దీంతో ఇంట్లోవారు, కనిపించినవారు, తెలిసినవారు ఇచ్చే సలహాలతో మరింత టెన్షన్ మొదలవుతింది. దీంతో మనకంటే ముందే ఇంట్లోనివారు మనం తినే ఆహారంపై ఆంక్షలు పెడుతుంటారు. వారు చెప్పడమే కాదు వైద్యులు కూడా అదే సూచిస్తుంటారు. సరైనది తినండి, సమయానికి నిద్రపోండి అంటూ సలహా ఇస్తుంటారు. అయితే, ముఖ్యంగా ఆహారం, పానీయాల విషయంలో చాలా ఆలోచించి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొంచెం అజాగ్రత్త కూడా రక్తంలో చక్కెరను పెంచుతుంది.

మన దేశంలో అన్నం తినకుండా భోజనం పూర్తి కాదు. దాదాపు ప్రతి రాష్ట్రంలోనే కాదు ప్రతి ఒక్కరి సంస్కృతిలో బియ్యం రోజువారీ ఆహారంలో భాగం. కానీ పంచదార తర్వాత అన్నం కూడా జాగ్రత్తగా తినాలి. అన్నం ఇష్టపడే వారికి ఇది మరింత కష్టంగా మారుతుంది. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కాకుండా మీరు ఇతర రకాల బియ్యం తీసుకోవచ్చు. విశేషమేంటంటే ఈ అన్నాన్ని రోజూ తినవచ్చు. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగకుండా అదుపులో ఉంటుంది. ఈ అన్నం ఏంటి, వాటిని ఎలా తయారు చేయాలి.. ఏ పదార్థాలతో తినవచ్చు వంటి ప్రతి ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇస్తున్నాం.

మధుమేహ బాధితులు ఎలంటి అన్నం తినాలి?

మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే లేదా మీకు షుగర్ ఉన్నట్లయితే.. మీరు ప్రతిరోజూ వైట్ రైస్ తినడం మానుకోవాలి. వీటికి బదులు కొన్నిసార్లు బ్రౌన్ రైస్, కొన్నిసార్లు సామల రైస్ తింటే మంచిది. సామల బియ్యాన్ని మిల్లెట్ రైస్ అని కూడా అంటారు.

ప్రతిరోజూ మీరు ఇలాంటి అన్నం తినవచ్చు. ఎందుకంటే సామాల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) 50 కంటే తక్కువ. అంటే, అవి చాలా వేగంగా గ్లూకోజ్ స్థాయిని పెంచవు, దీని కారణంగా రక్తంలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఈ బియ్యాన్ని బార్నియార్డ్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల, అవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా పని చేస్తాయి. అంటే, శరీరం నుంచి హానికరమైన అంశాలు.. అనవసరమైన పదార్ధాలను తొలగించవచ్చు. కానీ వాటిని ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో తినండి. ఎక్కువ తినడం వల్ల రక్తంలో చక్కెర చాలా తగ్గుతుంది.

సామల అన్నం ఎలా చేయాలి?

  • ముందుగా సామా బియ్యాన్ని శుభ్రమైన నీటిలో కడగాలి.
  • ఇప్పుడు వాటిని 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టండి.
  • ఇప్పుడు ఈ బియ్యాన్ని పాన్ లేదా ఓపెన్ పాత్రలో ఉడికించాలి. మీరు తీసుకున్న అన్నం కంటే..  ఒక ప్లేట్‌తో కప్పి, తక్కువ మంటపై ఉడికించాలి.
  • ఈ బియ్యం మాడిపోకుండా సమానంగా ఉడుకుతుందని నిర్ధారించుకోవడానికి.. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి.  పప్పు-కూరగాయ-చట్నీ, ఊరగాయతో వాటిని తినండి. చాలా రుచిగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం