Palm Oil Side Effects: వామ్మో.. పామ్ ఆయిల్ వాడకం ఇంత హానికరమా..? దాని దుష్ప్రభావాలేమిటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
వంటల కోసం మనం నిత్యం వాడే వంటనూనెలలో పామ్ అయిల్ ప్రథమ స్థానంలో ఉంటుంది. హోటళ్లలో, చాలా రెస్టారెంట్లలో, కొంత మంది ఇళ్లలో ఎక్కువగా వాడుతున్నది కూడా పామ్ అయిలే..
వంటల కోసం మనం నిత్యం వాడే వంటనూనెలలో పామ్ అయిల్ ప్రథమ స్థానంలో ఉంటుంది. హోటళ్లలో, చాలా రెస్టారెంట్లలో, కొంత మంది ఇళ్లలో ఎక్కువగా వాడుతున్నది కూడా పామ్ అయిలే. అయితే ఇది మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైనదంటే.. మద్యం, స్మోకింగ్ ఆ రెండూ కలిపితే వచ్చే నష్టాల కంటే పామ్ ఆయిల్ వాడటం వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ. ఇక ప్రపంచంలో పామ్ ఆయిల్‌ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం మనదే. ఈ పామ్ ఆయిల్ వెనక పెద్ద మాఫియా ఉందంటున్నారు డాక్టర్ భావన. ప్రస్తుతం దేశంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ పామ్ ఆయిల్‌నే ఎక్కువగా వాడుతున్నాయి. కారణం.. మిగతా వంట నూనెల కంటే పామ్ ఆయిల్ ధర తక్కువగా ఉండటమే. అయితే పామ్ ఆయిల్‌తో ఆరోగ్యానికి కలిగే నష్టాలు, దుష్ప్రభావాలు తెలియక చాలా మంది ఈ నూనెతో చేసిన వంటకాల్ని తినేస్తున్నారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. పెద్ద పెద్ద కంపెనీల్లో బిస్కెట్లు, కుకీల తయారీకి పామ్ ఆయిల్‌నే వాడుతున్నారు. చాకొలెట్స్ తయారీలో కూడా అదే. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా బ్రతకాలని కోరుకుంటాం. కానీ పామ్ ఆయిల్ లేదా పాల్మిటిక్ యాసిడ్ మన ప్రాణాలు తియ్యగలదని మనకు తెలియదు. షాకింగ్ విషయమేంటంటే.. కొన్ని రకాల కంపెనీలు.. విదేశాల్లో వేరే వంట నూనెను వాడుతూ.. ఇండియాలో అమ్మే ఉత్పత్తులకు మాత్రం పామ్ ఆయిల్‌ని వాడుతున్నాయని డాక్టర్ భావన తెలిపారు. ఈ పామాయిల్‌తో చేసినవి తిన్న ప్రతిసారీ పిల్లల బ్రెయిన్ దెబ్బతింటూనే ఉంటుందని ఆమె తెలియజేస్తున్నారు.
అంతేకాదు.. పామాయిల్ వల్ల గుండె జబ్బులు వస్తాయని.. చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారని భావన చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక సంస్థ (The World Economic Form) అంచనా ప్రకారం.. ప్రపంచంలో చనిపోతున్న జనాభాలో సగం మంది డయాబెటిస్, గుండె జబ్బుల వల్లే చనిపోతున్నారు. పామ్ ఆయిల్ మాఫియా అనేది.. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్నీ నాశనం చేస్తోంది. ఇది జంక్ ఫుడ్‌కి ప్రజలు అలవాటు పడేలా చేసి.. పండ్లు, కూరగాయలను తిననివ్వకుండా దూరం చేస్తోంది. గుండెను కాపాడే పండ్లను తినకుండా.. పామ్ అయిల్ వాడకం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి.. అడ్డమైన రోగాలూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు.. ఏమైనా కొనేటప్పుడు ఆ వస్తువుల్లో పామ్ ఆయిల్, పాల్మొలినిక్ ఆయిల్, పాల్మిటిక్ యాసిడ్ వంటివి కలిపినట్లు ఉంటే అస్సలు కొనవద్దంటున్నారు డాక్టర్ భావన. ఈ అంశంపై దేశవ్యాప్తంగా లక్ష మంది డాక్టర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాయాలని నిర్ణయించారని ఆమె తెలిపారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..