Coriander Leaf benefits: ఈ 5 సమస్యలకు చెక్ పెట్టాలంటే కొత్తిమీరను తినాల్సిందే.. అవేమిటో తెలిస్తే తినకుండా ఉండలేరు..

శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా |

Updated on: Jan 31, 2023 | 6:35 AM

కూరల, వంటకాల రుచిని పెంచడంలో కొత్తమీర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వివిధ రకాలుగా ఉపయోగించే కొత్తిమీర మన వంటకాల రుచిని పెంచడంలోనే కాక మన ఆరోగ్యాన్ని కాపాడడంలో..

Coriander Leaf benefits: ఈ 5 సమస్యలకు చెక్ పెట్టాలంటే కొత్తిమీరను తినాల్సిందే.. అవేమిటో తెలిస్తే తినకుండా ఉండలేరు..
Coriander Leaf Benefits

కూరల, వంటకాల రుచిని పెంచడంలో కొత్తమీర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వివిధ రకాలుగా ఉపయోగించే కొత్తిమీర మన వంటకాల రుచిని పెంచడంలోనే కాక మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. అవును. ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుల ప్రకారం కొత్తిమీరను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాక కొన్ని రకాల సమస్యలను నియంత్రించవచ్చు. అందుకు కొత్తిమీరలో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలే కారణం. అంతేకాకుండా దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కొత్తిమీరను వంటకాల్లోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

కొత్తమీరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లతోపాటు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి  మూలకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే  కొత్తమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్తిమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. కాలేయ వ్యాధులకు చెక్: కాలేయ సంబంధిత సమస్యలకు కొత్తిమీర చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  కొత్తిమీర ఆకులలో తగినంత ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిత్త రుగ్మతలు, కామెర్లు వంటి కాలేయ వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.
  2. ప్రేగు సంబంధిత వ్యాధులకు ముగింపు: కొత్తిమీర తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు, ప్రేగు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
  3. ఇవి కూడా చదవండి

  4. రోగనిరోధక శక్తి: కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధులతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
  5. గుండె జబ్బులు దూరం: కొత్తిమీర తీసుకోవడం వల్ల శరీరంలోని అనవసరమైన సోడియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇది చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
  6. బ్లడ్ షుగర్ నియంత్రణ: ఆహారంలో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడేవారి సమస్యలను ఇది కంట్రోల్‌లో పెడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu