Kiwi Fruit: రోగనిరోధక శక్తిని పెంచే కివీలో పోషకాలు పుష్కలం.. మరిన్ని ప్రయోజనాల కోసం ఇలా ట్రై చేయండి..!

కివీ పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వైద్య నిపుణులు ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా కివీలను తినమని సూచిస్తారు. డెంగ్యూ, చికున్‌ గున్యా..

Kiwi Fruit: రోగనిరోధక శక్తిని పెంచే కివీలో పోషకాలు పుష్కలం.. మరిన్ని ప్రయోజనాల కోసం ఇలా ట్రై చేయండి..!
Kiwi Benefits
Follow us

|

Updated on: Feb 01, 2023 | 8:20 AM

పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. పండ్లను నిత్యం తినడం వల్ల శరీరం కూడా దృఢంగా, పుష్టిగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇక అలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పండ్లలో కివీ పండు ప్రత్యేకమైనది. ఈ కివీ పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వైద్య నిపుణులు ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా కివీలను తినమని సూచిస్తారు. డెంగ్యూ, చికున్‌ గున్యా వంటి వ్యాధుల బారిన పడితే రక్తంలోని ప్లేట్‌లెట్స్ కౌంట్‌ పడిపోతుంది. ఆ సమయంలో కివీ తీసుకుంటే ప్లేట్‌లెట్స్‌ సులభంగా పెరుగుతాయి.

ఇంకా డీహైడ్రేషన్, పొడి చర్మం ఉన్నవారు కివీని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో అసలైన పొటాషియం లభిస్తుంది. ఇది శారీరక బలహీనతను తొలగిస్తుంది. మీరు కివీ తినలేకపోతే దాంతో కొన్ని రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. కివిని రసం, సలాడ్ రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ఐస్ క్రీం, కేకులు తయారుచేయవచ్చు. ఇంకా ఏయే విధాలుగా కివీలను ఉపయోగించవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఎనర్జీ డ్రింక్‌: నిమ్మకాయ, పుదీనా, కివీని కలపడం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎనర్జీ డ్రింక్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో ఈ ఎనర్జీ డ్రింక్ చాలా ఆరోగ్యకరమైనది.

ఇవి కూడా చదవండి

కివి కేక్: మీరు మీ ఇంట్లోనే కివీతో రుచికరమైన కేక్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది మీకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేగాక తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.

కివి స్మూతీ: ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం కోసం ఇది గొప్ప ఎంపిక అవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు.

కివి మిల్క్ షేక్: మీరు పాలతో కివీ మిల్క్‌షేక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో డ్రైఫ్రూట్‌లను కలపడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది.

కివి పాన్‌కేక్‌: మీరు కివీ పాన్‌కేక్‌ అల్పాహారంగా తీసుకోవచ్చు. రుచిని పెంచడానికి దీనికి తేనె కలుపుకోవచ్చు.

కివి సల్సా: ఇంట్లో మీరు అవకాడో, కివీ పండు, ఉప్పు, మిరియాలు కలపడం ద్వారా రుచికరమైన సల్సాను తయారు చేయవచ్చు. ఇది రుచిని పెంపొందించడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కివి జ్యూస్‌: కివీ జ్యూస్ ఒక్క క్షణంలో రెడీ అవుతుంది. కివీ జ్యూస్ రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ శరీరాన్ని చల్లబరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి