అనుబంధాలకు మూలం నైరుతి.. వాస్తు ప్రకారం ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు కీలక పాత్ర పోషిస్తాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నా, కుటుంబంలో కీచురాటలు, వాదనలు, ఆవేశాలు, కోపతాపాలు పెరిగినా ఇక మనకు మిగిలేది విషాదాలు, విచారాలే. కాగా, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి,

అనుబంధాలకు మూలం నైరుతి.. వాస్తు ప్రకారం ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..
Southwest
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Feb 02, 2023 | 4:30 AM

జీవితంలో కుటుంబానికి, కుటుంబ సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సాధారణంగా మనం మన సాధక బాధకాలను, సుఖసంతోషాలను, మంచి చెడులను కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా పంచుకుంటాం. కష్ట కాలంలో మనల్ని ఆదుకునేది కుటుంబమే. అందువల్ల కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు కీలక పాత్ర పోషిస్తాయి. కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నా, కుటుంబంలో కీచురాటలు, వాదనలు, ఆవేశాలు, కోపతాపాలు పెరిగినా ఇక మనకు మిగిలేది విషాదాలు, విచారాలే. కాగా, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి, అనుబంధాలు క్షీణించిపోవడానికి వాస్తు పరంగా ఉన్న లోపాలు ఏమిటన్నది పరిశీలించవలసి ఉంది. ఈ లోపాలను సవరించి, లో కొన్ని మార్పులు చేసే పక్షంలో తప్పకుండా కుటుంబ సంబంధాలు మెరుగుపడి జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది.

ఇంట్లోకి ప్రవేశించే కొన్ని ఎనర్జీలు, తరంగాల వల్ల కుటుంబాల అనుబంధాలు, ప్రేమలు, సంబంధాలు ప్రభావితం అవుతాయి. వాస్తు దోషాలు, లోపాల వల్ల మొదటగా మనశ్శాంతి దెబ్బతింటుంది. తరచూ మూడ్ మారిపోతుంది. ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్య కోప తాపాలు, అపార్ధాలు చోటు చేసుకుంటుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో 16 జోన్లు ఉంటాయి. ఇవి కుటుంబ సభ్యుల మీద పని చేస్తుంటాయి. ఇందులో నైరుతి మూల భార్యాభర్తల అనుబంధాన్ని, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న ప్రేమలను ప్రభావితం చేస్తుంది. వాయువ్య మూల కుటుంబానికి బంధువులకు మధ్య ఉండే సంబంధాలను పటిష్టం చేస్తుంది. కుటుంబ సంబంధాలు పటిష్టంగా ఉండాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలు, అనుబంధాలు కలకాలం కొనసాగాలన్నా కొన్ని వాస్తు సూత్రాలను ఇళ్లల్లో పాటించడం మంచిది.

కొన్ని ముఖ్యమైన చిట్కాలు

ఇవి కూడా చదవండి

1. ఇంటి ముఖద్వారానికి నైరుతి దిశ చాలా మంచిది. ముఖద్వారానికి ముందు పసుపు రంగు కాళ్లు తుడుచుకునే పట్టాను వేయటం శ్రేయస్కరం. దీనివల్ల కుటుంబ బంధాలు గట్టి పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంపర్కం, సామరస్యం అభివృద్ధి చెందుతాయి. పసుపు రంగు కాళ్ల పట్టాలు నెగటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి. నైరుతి దిశలో పసుపు రంగు తెరలు వేసినా, తలుపులకు పసుపు రంగు వేసినా ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కోపతాపాలను అదుపు చేస్తుంది. 2. పడక గది దక్షిణ దిశలో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలు, అనుబంధాలు వెల్లివిరుస్తాయి. వాదనలు, అపార్థాలకు అవకాశం ఉండదు. నైరుతి మూలలో లవ్ బర్డ్స్ ను పెట్టుకుంటే కుటుంబంలో ప్రేమలు పెరుగుతాయి. పడక గదిలో ఇనుప మంచాల కంటే చెక్క మంచాలే దాంపత్య సౌఖ్యాన్ని పెంచుతాయి. 3. నైరుతి మూలలోని గోడకు ఒక ఫ్యామిలీ ఫోటోను వల్ల కుటుంబ సంబంధాలు పటిష్టంగా కొనసాగుతాయి. 4. పూజా మందిరంలో పొరపాటున కూడా ఎర్రని బల్బును పెట్టకూడదు. ఇది కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తుంది. పూజ గదిలో ఎర్రటి పోస్టర్లను కూడా అంటించకూడదు. ఇది కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని వివాదాలకు కారణం అవుతుంది. 5. ఇంటికి ఉత్తర దిశలో పచ్చటి మొక్కలను నాటడం లేదా ఏర్పాటు చేయడం వల్ల కుటుంబ సంబంధాలు బాగా బలపడతాయి. ప్రేమలు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. 6. ఈశాన్య మూలలో మనీ ప్లాంట్ నాటడం లేదా ఏర్పాటు చేయడం వల్ల కుటుంబంలో అనుబంధాలు పటిష్టమవుతాయి. అపార్ధాలు, అభిప్రాయ భేదాలు సమసి పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆర్థిక సమస్యలు తలెత్తవు. 7. తూర్పు వైపున గోడకు సూర్యుడి బొమ్మను, ఇంటి ముఖ ద్వారం దగ్గర గణేశుడి బొమ్మను ఏర్పాటు చేయడం వల్ల ఇంటికి ఎటువంటి నరఘోషలు, దిష్టి వగైరాలు అంటవు. ఇవి ఇంటి సౌభాగ్యాన్ని కాపాడుతాయి. 8. వ్యక్తిగత గదిలో రోజు సువాసన పువ్వులను ఏర్పాటు చేసుకోవడం వల్ల మూడ్ ఎల్లవేళలా అనుకూలంగా ఉంటుంది. ఇది మనశ్శాంతికి దోహదం చేస్తుంది. పచ్చటి పువ్వులు, నీలం రంగు పువ్వులు కూడా ప్రశాంతతను ఇస్తాయి. ఆగ్నేయంలో ఎర్రటి పువ్వులను ఏర్పాటు చేయడం కుటుంబ ఆరోగ్యానికి చాలా మంచిది. 9. ఇంటి ముఖద్వారం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. అందువల్ల దీన్ని పూలతోనో, రంగులతోనో, మంచి బొమ్మలతోనో అలంకరించడం మంచిది. ఫలితంగా కుటుంబం కూడా కళకళలాడుతూ ఉంటుంది. 10. నైరుతి దిశలో కానీ, ఉత్తర దిశలో కానీ, వాయువ్యంలో కానీ చెత్త పడేయకూడదు. ఈ దిక్కుల్లో అనవసర వస్తువులను లేదా విరిగిన వస్తువులను ఉంచకూడదు. అప్పుడు ఆ కుటుంబం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. 11. నైరుతి, వాయువ్యం, ఉత్తర దిక్కుల్లో వాషింగ్ మెషిన్ ను ఉంచకూడదు. ఇది కుటుంబ బంధాలు పటిష్టంగా ఉండటానికి అవరోధంగా మారుతుంది. వాషింగ్ మెషిన్ ను ఆగ్నేయంలో ఉంచడం మంచిది.

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!