Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramanuja Samatha Spoorthi: సమతా స్పూర్తి కేంద్రంలో ఆధ్మాత్మిక జాతర.. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు కన్నులపండువగా వేడుకలు..

హైదరాబాద్ సమతా స్పూర్తి కేంద్రంలో ఆధ్మాత్మిక జాతరకు వేళైంది. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు రోజూ కనులపండువగా ఆధ్యాత్మిక వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఏడాది..

Ramanuja Samatha Spoorthi: సమతా స్పూర్తి కేంద్రంలో ఆధ్మాత్మిక జాతర.. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు కన్నులపండువగా వేడుకలు..
Statue Of Equality
Follow us
Ganesh Mudavath

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 01, 2023 | 9:10 PM

హైదరాబాద్ సమతా స్పూర్తి కేంద్రంలో ఆధ్మాత్మిక జాతరకు వేళైంది. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు రోజూ కనులపండువగా ఆధ్యాత్మిక వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆశ్రమంలో సమతా కుంభ్ 2023 పేరుతో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ముచ్చింతల్‌లోని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణోత్సవం జరిగి ఏడాది పూర్తవుతోంది. గతేడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముచ్చింతల్ ఆశ్రమం పెద్ద ఎత్తున ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైంది. రామానుజులవారి బ్రహ్మోత్సవాలు జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆధ్యాత్మిక పండగను 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు.. స్వామివారి రథోత్సవం, చక్రస్నానంతో పూర్తవుతాయి.

నిత్య కైంకర్యాలు, విశిష్ట వాహన సేవలు ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ముచ్చింతల్ ఆశ్రమ నిర్వాహకులు త్రిదండి చినజీయర్ స్వామి వెల్లడించారు. ఈ సంవత్సర కాలంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది సమతా మూర్తి, ఆశ్రమాన్ని దర్శించుకున్నారని వివరించారు. ఫిబ్రవరి 2 నుంచి 12వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇదే తేదీల్లో బ్రహ్మోత్సవాలు జరుపుతామన్నారు చినజీయర్ స్వామి. శాస్త్రోక్తంగా అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. సమతా కుంభ్ పేరుతో జరిగే ఉత్సవాల్లో పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు త్రిదండి చినజీయర్ స్వామి.

సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమే అనే స్ఫూర్తిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన ఆ సమతా మూర్తి రామానుజాచర్యుల వారిని స్మరించుకుంటూ ఈ బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చే ప్రతి భక్తుడికీ తీర్థ ప్రసాదాలను అందజేయనున్నారు. భక్తి జ్ఞాన వికాస తరంగాల వ్యాప్తికి ఫిబ్రవరి 2న విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు. 3వ తేదీన సూర్యప్రభ వాహన సేవ, అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, 4వ తేదీన సమతామూర్తికి కృతజ్ఞాంజలి కీర్తన, రామానుజ నూత్తందాది సామూహిక పారాయణం ఉంటోంది. ఈనెల 5వ తేదీన రామానుజాచార్యులవారి విగ్రహానికి 108 రూపాల్లో శాంతి కల్యాణోత్సవం, 6వ తేదీన ఉదయం వసంతోత్సవం, సాయంత్రం 18 గరుడ సేవలు, 7వ తేదీన ఉదయం డోలోత్సవం, హనుమద్వాహన సేవ, 18 గరుడ సేవలను నిర్వహించనున్నారు. ఈనెల 8వ తేదీన కల్హరోత్సవం, సామూహిక పుష్పార్చన, సాయంత్రం 18 రూపాల్లో తెప్పోత్సవం జరగనుంది.

ఇవి కూడా చదవండి

వేడుకల్లో భాగంగా 9వ తేదీన రామానుజులవారికి వరివస్య, సాయంత్రం అశ్వ వాహన సేవ, 18 గరుడ సేవలుంటాయి. 10వ తేదీన ఉదయం సామూహిక ఉపనయనాలు, సాయంత్రం గజవాహన సేవ, 18 గరుడ సేవలు, 11వ తేదీన ఉదయం రథోత్సవం, చక్రస్నానం, మధ్యాహ్నం విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం, 12వ రోజున ఉత్సవం అంత్యస్నపనం, సాయంత్రం మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణలను నిర్వహించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..