Karthika Deepam: సీరియల్ మీద పిచ్చి.. కార్తీకదీపం చూడకుండా అడ్డు నిల్చున్న నేరానికి.. ఓ వ్యక్తి వేసిన శిక్ష ఏమిటో తెలుసా..

Surya Kala

Surya Kala |

Updated on: Feb 01, 2023 | 1:43 PM

అన్నిపనులూ ముగించుకొని...కార్తీక దీపం సీరియల్‌ చూసేందకు సిద్ధమయ్యాడు గట్టు మొగిలి. ఇంతలో మద్యం అప్పుగా ఇవ్వమంటూ మొగిలిని అడిగాడు వెంకటయ్య. కుదరదని తెగేసి చెప్పినా కదలకుండా మొగిలిని విసిగించడం మొదలుపెట్టాడు.

Karthika Deepam: సీరియల్ మీద పిచ్చి.. కార్తీకదీపం చూడకుండా అడ్డు నిల్చున్న నేరానికి.. ఓ వ్యక్తి వేసిన శిక్ష ఏమిటో తెలుసా..
Karthika Deepam Serial

ప్రస్తుతం సినిమా ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సినిమాలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ పంచాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓటీటీలు అందుబాటులోకి రావడంతో ఎంతోమంది వాటి ద్వారా కూడా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇలా సినిమా రంగం మొత్తం కొత్త పుంతలు తొక్కుతూ ఉంటే.. అటు ఎంతో మంది జనాలలో సీరియల్ పిచ్చి మాత్రం వదలడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సీరియల్ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు మహిళలు అన్ని పనులు పక్కనపెట్టి టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఇటీవల ట్రెండ్ మారింది. మగవారు సైతం సీరియల్ వస్తుందంటే టీవీ ముందు నుంచి కదలడం లేదు. పక్కన ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు.

అదే సీరియల్‌ పిచ్చి… వరంగల్‌లో ఓ వ్యక్తిని రక్తమోడేలా చేసింది. సీరియల్‌ చూడకుండా చేసిన నేరానికి ఆ వ్యక్తి వేలుని కసిదీరా కొరికి పరారయ్యాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిలి అనే వ్యక్తి అంతలా మునిగిపోయేలా చేసిన సీరియల్‌ కార్తీక దీపం. అయితే కేవలం ఆడవాళ్ళకే టీవీ సీరియళ్ల పిచ్చి ఉంటుందన్నది అపోహేనని ఈ ఘటనతో తేలిపోయింది. అన్నిపనులూ ముగించుకొని…కార్తీక దీపం సీరియల్‌ చూసేందకు సిద్ధమయ్యాడు గట్టు మొగిలి. ఇంతలో మద్యం అప్పుగా ఇవ్వమంటూ మొగిలిని అడిగాడు వెంకటయ్య. కుదరదని తెగేసి చెప్పినా కదలకుండా మొగిలిని విసిగించడం మొదలుపెట్టాడు. అసలే ఆఖరిఎపిసోడ్‌..ఇటువైపు వెంకటయ్య పోరు…ఆగ్రహించిన మొగిలి వెంకటయ్య కుడిచెయ్యి చూపుడు వేలిని కొరికేశాడు. కార్తీక దీపం సీరియల్‌ చూడకుండా విసిగించడంతో కోపమొచ్చి వేలుకొరికేశానని ఒప్పుకున్నాడు నిందితుడు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu