Nagababu: జబర్ధస్త్‎ నుంచి అందుకే బయటకు వచ్చేశాను.. రీఎంట్రీ గురించి నాగబాబు ఏమన్నారంటే ?..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jan 31, 2023 | 6:02 PM

తాజాగా నాగబాబు జబర్దస్త్ షో గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. జబర్దస్త్ వాళ్లు పిలిస్తే మళ్లీ వెళ్లెందుకు రెడీ అంటున్నారు.

Nagababu: జబర్ధస్త్‎ నుంచి అందుకే బయటకు వచ్చేశాను.. రీఎంట్రీ గురించి నాగబాబు ఏమన్నారంటే ?..
Nagababu

మెగా బ్రదర్ నాగబాబుకు బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ షోలో నాగబాబుతోపాటు.. రోజా జడ్జీలుగా వ్యవహరించారు. జబర్దస్త్ కామెడీ షో వేదికపై రోజా, నాగబాబు జడ్జీలుగా ఉన్నంతకాలం ఈ షోకు తిరుగులేదు. కంటెస్టెంట్స్ స్కిట్స్.. వారిపై వీరిద్దరు వేసే కౌంటర్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. కొన్నెళ్లు ఈ షోలో అలరించిన ఆయన.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చారు. నాగబాబు తర్వాత పలువురు కంటెస్టెంట్స్ కూడా ఈ షో నుంచి బయటకు రావడంతో.. జబర్దస్త్ కళ తప్పిపోయింది. దాదాపు ఏడేళ్లు జబర్దస్త్ జడ్జీగా వ్యవహరించిన నాగబాబు బయటకు వచ్చిన అనంతరం.. ఇక ఆ తర్వాత జబర్దస్త్ షోపై అనేక ఆరోపణలు చేశారు. అటు కిర్రాక్ ఆర్పీ, నాగబాబు ఈ షో పై అనేక విమర్శలు గుప్పించగా.. అటు నుంచి హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ సైతం అంతే స్తాయిలో బదులిచ్చారు. కొన్ని రోజులు ఈ షో గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా నాగబాబు జబర్దస్త్ షో గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. జబర్దస్త్ వాళ్లు పిలిస్తే మళ్లీ వెళ్లెందుకు రెడీ అంటున్నారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. “మల్లెమాలతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కేవలం కింద ఉండే వాళ్లతోనే ఇదంతా. ఆ మేనేజర్ ల వల్లే గొడవలు. వాళ్లేం చేస్తారంటే.. యాజమాన్యాన్ని ఇంప్రెస్ చేయడానికి తిక్క వేశాలు వేస్తారు. వందమందికి నష్టం కలిగించే పనులు చేస్తే నాకు చిరాకు వస్తుంది. అందుకే జబర్దస్త్ కు దూరం అయ్యాను. ఇప్పుడు జబర్దస్త్ నుంచి పిలుపు వస్తే వెళ్తాను. ఆలోచిస్తాను. నాకు వాళ్లతో శత్రుత్వం లేదు. అలాగనే నా అంతట నేను వెళ్లి.. వస్తాను అని అడిగేది లేదు. ఎందుకంటే.. నాకు నచ్చక నేను బయటకు వచ్చేశాను. కాబట్టి వాళ్లు పిలిస్తే వెళ్తాను కానీ నా అంతట నేను వెళ్లను.

జబర్దస్త్ గురించి శ్యామ్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఆ స్టేజ్ మీద నేను చేసినదానికంటే జబర్దస్త్ స్టేజ్ వెనక చేసిన వర్క్ చాలా ఉంది. నాకు ఇచ్చే రెమ్యూనరేషన్ తీసుకుని వచ్చేయ్యొచ్చు. కానీ ఆ షోను ఓన్ చేసుకుని ఒక యూనిటీ తీసుకుని వచ్చాను. జబర్దస్త్ ఫ్యామిలీ అనే ఫీలింగ్ రావడానికి చాలా చేశాను. చివర్లో నేను అక్కడ ఫిట్ కానని బయటకు వచ్చాను ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu