Sara Ali Khan: అందాల యువరాణి సారా అలీ ఖాన్ బ్యూటీ సిక్రెట్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ముద్దుగుమ్మ..

ప్రస్తుతం యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిన సారా.. ఒకప్పుడు 90 కేజీల బరువు ఉండేది. కాలేజీ రోజుల్లో ఆమె ఎంతో లావుగా ఉండేది. అందుకు కారణం ఆమె చిన్నతనంలోనే పీసీఓడీ సమస్యతో పోరాడింది.

Sara Ali Khan: అందాల యువరాణి సారా అలీ ఖాన్ బ్యూటీ సిక్రెట్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ముద్దుగుమ్మ..
Sara Ali Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2023 | 3:47 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. హీరో సైఫ్ అలీ ఖాన్ నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో అభిమానులను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటుంది. ప్రస్తుతం యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిన సారా.. ఒకప్పుడు 90 కేజీల బరువు ఉండేది. కాలేజీ రోజుల్లో ఆమె ఎంతో లావుగా ఉండేది. అందుకు కారణం ఆమె చిన్నతనంలోనే పీసీఓడీ సమస్యతో పోరాడింది. దీంతో వయసుకు మించిన బరువుతో బొద్దుగా ఉండేది. కానీ ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాక.. తనను తాను మార్చుకోవడానికి సారా ఎంతో కష్టపడింది. జిమ్ లో ఎన్నో తీవ్రమైన కసరత్తులు చేస్తూ.. డైట్ ఫాలో అవుతూ తన శరీరాకృతిని మార్చుకుంది.

శరీరాకృతితోపాటు.. తన ముఖసౌందర్యానికి కారణం తమ తల్లి అమృతా చెప్పిన చిట్కాలే కారణం అంటోంది ఈ బ్యూటీ. తాజాగా తన అందం సిక్రెట్ బయటపెట్టింది. ఫిట్ బాడీ, గ్లోయింగ్ స్కిన్ కోసం వారాకోసారి జిమ్ డైట్ ఫాలో అవుతందటి. అదెంటంటే.. పైలేట్స్, రన్నింగ్, జిమ్, స్వి్మ్మింగ్ చేస్తూ… తన శరీరం, చర్మం రెండింటిని మెయింటెన్ చేస్తున్నానంటుంది. ఇక తన తల్లి చెప్పినట్లుగా ఎలాంటి సమయంలో అయినా.. ఏ పండు తిన్నా.. వాటి తొక్కలను తన ముఖానికి అప్లై చేస్తుందట. ఇలా చేయడం వలన తన ముఖం కాంతివంతంగా కనిపిస్తుందట.

ఇవి కూడా చదవండి

అలాగే బాదం పప్పుతో ఫేస్ ప్యాక్ వేస్తుందట. ఒక టీ స్పూన్ బాదం పప్పు పౌడర్ లో ఒక టీ స్పూన్ శనగపిండి, రెండు టీ స్పూన్ల పాలు, కొన్ని రోజ్ వాటర్ చుక్కలు కలిపి మొహానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తానంటుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే కాస్మెటిక్స్ అవసరం లేకుండానే.. ముఖం కాంతిలీనుతుందని చెప్పుకొచ్చింది సారా. మొత్తానికి అమ్మ చెప్పిన చిట్కాలతో మయా చేస్తోంది సారా.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.