Taraka ratna Health Update: ‘సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి.. తారకరత్న కోలుకుంటున్నారు’.. ప్రొడ్యూసర్స్ సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్..

ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ప్రొడ్యూసర్ సంఘం సెక్రటరీ.. నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తులు అయిన తుమ్మల ప్రసన్న కుమార్ స్పందించారు.

Taraka ratna Health Update: 'సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి.. తారకరత్న కోలుకుంటున్నారు'.. ప్రొడ్యూసర్స్ సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్..
Tarakaratna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 31, 2023 | 3:00 PM

సినీనటుడు నందమూరి తారకరత్న బెంగుళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. హీరో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు దగ్గరుండి తారకరత్న ఆరోగ్య పరిస్థితి చూసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ.. ఆయన హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఆయన పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ప్రొడ్యూసర్ సంఘం సెక్రటరీ.. నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తులు అయిన తుమ్మల ప్రసన్న కుమార్ స్పందించారు.

తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ” సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లేని నటుడు తారకరత్న. ఆయన చాలా త్వరగా కోలుకుంటున్నారు. కాళ్ళు, చేతులు కదుపుతున్నారు. ఆపస్మాకర స్దితిలో ఉండి బాలకృష్ణ మాట విన్న వెంటనే చలించారు. కుప్పంలో తారకరత్న గుండె దాదాపు 45 నిమిషాలు ఆగింది. బాలకృష్ణ వెళ్ళి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివారు. మృత్యంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగింది. తారకరత్నకు యూరిన్ నడుస్తుంది. చేతి వేళ్ళకదలికలు ఉంటే మెదడు కూడా బాగానే పనిచేస్తుందని డాక్టర్లు అన్నారు. తారకరత్న వంద శాతం సేఫ్ గా ఉన్నాడు. ఆయన హెల్త్ గురించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు. యువగళం వలన అనౌన్స్ చేయటం లేదనే వార్తలు అవాస్తవం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రార్దనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కుటుంబం అంతా దగ్గరుండి మానెటరింగ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల పిలుపులకి ఆయన పల్స్ రేట్ డిఫరెంట్ గా కనబడుతుంది. ఇప్పుడే MRI ,CT స్కాన్ లలో ఏమీ తెలియవు. బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎంత టైం పడుతుంది అనేది డాక్టర్లు నిర్దారించలేరు .. ఇంకా సమయం పడుతుంది. ఎక్మో , స్టంట్ అనేదే జరగలేదు. హార్ట్ , కిడ్నీ , లివర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి.” అన్నారు.