AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika: ‘నువ్వే చెప్పావు.. ఎవరి గతాన్ని పట్టించుకోవద్దని’. హన్సిక పెళ్లికి ఇన్ని కష్టాలా.?

దేశ ముదురు చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార హన్సిక. తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించిందీ బ్యూటీ. ఇక చేతిలో వరుస సినిమాలు ఉన్న సమయంలోనే హన్సిక వివాహం చేసుకుంది. తాను ప్రేమించిన సోహైల్‌ కథూరియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త అయిన సోహైల్‌ కతూరియాతో హన్సిక వివాహం...

Hansika: 'నువ్వే చెప్పావు.. ఎవరి గతాన్ని పట్టించుకోవద్దని'. హన్సిక పెళ్లికి ఇన్ని కష్టాలా.?
Hansika
Narender Vaitla
|

Updated on: Jan 31, 2023 | 4:34 PM

Share

దేశ ముదురు చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార హన్సిక. తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించిందీ బ్యూటీ. ఇక చేతిలో వరుస సినిమాలు ఉన్న సమయంలోనే హన్సిక వివాహం చేసుకుంది. తాను ప్రేమించిన సోహైల్‌ కథూరియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త అయిన సోహైల్‌ కతూరియాతో హన్సిక వివాహం ఇటీవల జైపూర్‌లోని ముండోతా కోటలో ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే హన్సిక వివాహమాడిన సోహైల్‌కు ఇది రెండో వివాహం కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే అప్పటికే వివాహామైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక.. కుటుంబ సభ్యులను ఒప్పించడం విశేషం. అయితే ఈ విషం అంత సాఫీగా మాత్రం సాగలేదు. ఈ విషయాన్ని హన్సికానే స్వయంగా తెలిపింది. డిసెంబర్‌ 4న జైపూర్‌లో జరిగిన హన్సిక వివాహ వేడుకను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

హన్సిక లవ్‌ షాదీ డ్రామా అనే పేరుతో ఈ వెడ్డింగ్‌ డాక్యుమెంట్‌ను స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ‘‘నిజమైన ప్రేమ. డ్రీమ్‌ షాదీ. ప్రతిదీ పర్‌ఫెక్ట్‌’’ అంటూ హన్సిక తన వివాహ సంగతులను పంచుకుంది. సోహెల్‌ను పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో హన్సిక పోరాటం చేసినట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా టీజర్‌లో హన్సిక చెప్పే.. ‘నువ్వే చెప్పావు.. ఎవరి గతాన్ని పట్టించుకోవద్దు’ అనే సంభాషణ ఆసక్తిగా ఉంది. హన్సిక ఈ మాటను తన తల్లితో మాట్లాడినట్లు అర్థమవుతోంది. టీజర్‌తో ఈ వెడ్డింగ్‌ డాక్యుమెంటరీకి ఒక్కసారిగా హైప్‌ పెరిగింది. మరి పూర్తి వీడియో వస్తే మరెన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ వెడ్డింగ్ ఫుల్‌ వీడియో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..