Sonu Sood: ఆమె గాత్రానికి సోనూ ఫిదా.. కూతురు కోసం పాడిన పాటతో సినిమాలో ఛాన్స్..

Surya Kala

Surya Kala |

Updated on: Jan 29, 2023 | 2:01 PM

సోషల్‌ మీడియాలో ఓ మహిళ పాటపాడుతున్న వీడియో చూసి, ఆమె గొంతు విన్న సోనూసూద్‌ ఫిదా అయిపోయారు. ఆ వీడియోలో ఓ మహిళ రోటీలు చేస్తూ ఓ పాట హమ్‌ చేస్తుంది. అది విన్న ఆమె కూతురు పాటను కంటిన్యూ చేయమని కోరుతుంది.

Sonu Sood: ఆమె గాత్రానికి సోనూ ఫిదా.. కూతురు కోసం పాడిన పాటతో సినిమాలో ఛాన్స్..
Sonu Sood
Follow us

బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కరోనా సమయంలో అనేకమందికి సహాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌ తన సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. సొంతలాభం కొంతమానుకొని పొరుగువారికి నువు పాటుపడవోయ్‌ అన్నట్లు… ఇటీవల సినిమాలు బాగా తగ్గించిన ఈ రియల్ హీరో సామాజిక సేవపట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. తాజాగా సోనూసూద్‌ చేసిన ఓ పని ప్రజల మనసుదోచుకుంది.

సోషల్‌ మీడియాలో ఓ మహిళ పాటపాడుతున్న వీడియో చూసి, ఆమె గొంతు విన్న సోనూసూద్‌ ఫిదా అయిపోయారు. ఆ వీడియోలో ఓ మహిళ రోటీలు చేస్తూ ఓ పాట హమ్‌ చేస్తుంది. అది విన్న ఆమె కూతురు పాటను కంటిన్యూ చేయమని కోరుతుంది. అలా ఆ మహిళ ‘మేరే నైనా సావన్ భాదోన్’ పాటను పాడింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ప్రొఫెషనల్స్‌కి ఏమాత్రం తీసిపోని ఆమెగొంతు విని నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా సోనూసూద్‌ కూడా ఆ మహిళ పాట విని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఆమె గళం అక్కడితో ఆగిపోకూడదని, ఆమెకు సినిమాలో పాడే అవకాశం కల్పించారు.

ఇవి కూడా చదవండి

సోనూసూద్‌ నిర్ణయాన్ని ఆయన అభిమానులు అభినందించారు. సోనూ మంచి మనసుకు మరోసారి ప్రశంసలు వెల్లువెత్తాయి. అడిగినవారికి కాదనకుండా సాయం చేసే దాతృత్వం ఆయనకే చెల్లిందంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu