Rajinikanth: అనుమతి లేకుండా పేరుని ఉపయోగించుకుంటే చర్యలు తప్పవంటూ రజనీ పబ్లిక్ నోటీస్
రజనీకున్న పేరుని క్రేజ్ ను గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన పేరే ఒక బ్రాండ్.. కనుక క్రేజ్ ను పేరుని కొందరు.. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా.. తమ వస్తువు ప్రజలకు చేరువ కావడం కోసం వినియోగించుకుంటూ ఉంటారు..
సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ పరిశ్రమలో సామాన్యుడిగా అడుగు పెట్టి.. అసామాన్యుడిగా ఎదిగారు. తలైవర్ కు మనదేశంలో మాత్రమే కాదు.. జపాన్ వంటి ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకున్న పేరుని క్రేజ్ ను గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన పేరే ఒక బ్రాండ్.. కనుక క్రేజ్ ను పేరుని కొందరు.. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా.. తమ వస్తువు ప్రజలకు చేరువ కావడం కోసం వినియోగించుకుంటూ ఉంటారు.. ఇలాంటి సమయంలో కొన్ని సార్లు రజనికి తెలియకుండానే ఇబ్బందులు ఏర్పడవచ్చు.. ఈ నేపథ్యంలో రజని కాంత్ లాయర్ రంగంలోకి దిగారు.
తమ అనుమతి లేకుండా తన పేరును గానీ.. పోటోలను గానీ ఎవరైనా వాడుకుంటే చర్యలు తీసుకుంటామంటూ పబ్లిక్ నోటీసులు ఇచ్చారు సూపర్ స్టార్ రజినీ కాంత్ తరపు లాయర్ సుబ్బయ్య. దశాబ్దాలుగా సూపర్ స్టార్ రజినీకాంత్ పలు బాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ప్రతిష్టకు లేదా వ్యక్తిత్వానికి ఏదైనా నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లతో పాటు కంపెనీలు.. రజినీకాంత్ పేరు, వాయిస్, ఫోటోలతో పాటు ఇమేజ్‌ని ఉపయోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, జనాలను ప్రలోభపెట్టేందుకు ఇవి వినియోగిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఇక నుంచి ఎవరైనా వ్యక్తిగత, వ్యాపార అవసరాలు సహా ఎందులో అయినా ఆయన అనుమతి లేనిదే వినియోగిస్తే.. నోటీసులు ఇస్తామన్నారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..