Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లెక్కలోని చిక్కులను చకచకా పరిష్కరిస్తున్న బాలుడు.. మా బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు

హోమ్ ను ఎగ్గొట్టడానికి వీలైనంతగా సాకులను వెదుకుతారు. హోమ్ వర్క్ ను వీలైనంత త్వరగా ముగించి ఆటలకు వెళ్లడం కోసం ఏదొక మార్గాన్ని వెతుకుతారు. అయితే ఇందుకు భిన్నంగా ఒక చిన్నారి బాలుడు తన హోమ్‌వర్క్ ను ఆనందంతో చేస్తున్న వీడియో తెరపైకి వచ్చింది.

Viral Video: లెక్కలోని చిక్కులను చకచకా పరిష్కరిస్తున్న బాలుడు.. మా బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు
Kid Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2023 | 11:57 AM

పిల్లలకు సంబంధించిన అందమైన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు. పిల్లలకు సంబంధించిన కంటెంట్ ఇంటర్నెట్‌లో అత్యధికంగా వీక్షించబడే కంటెంట్‌లో ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. మొబైల్, ల్యాప్‌టాప్ లోని మెమరీ పిల్లల ఫోటోలు, వీడియోలతో నిండిపోతుంది. పిల్లల ఫన్నీ వీడియోలను మళ్ళీ మళ్ళీ చూడటమే కాదు.. ఒకరికొకరు పంచుకుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారికి తమ చిన్ననాటి రోజులు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి.

చిన్నతనంలో.. పాఠశాల నుండి వచ్చిన తర్వాత గడిపిన బాల్యం నాటి రోజులు మీరు గుర్తుకు వస్తాయి. స్కూల్ లో ఇచ్చిన హోమ్ వర్క్ ఇంటి దగ్గర చేయాల్సిన సమయంలో కొందరు చిన్నారులు ఆసక్తిని చూపించరు. సరికదా.. హోమ్ ను ఎగ్గొట్టడానికి వీలైనంతగా సాకులను వెదుకుతారు. హోమ్ వర్క్ ను వీలైనంత త్వరగా ముగించి ఆటలకు వెళ్లడం కోసం ఏదొక మార్గాన్ని వెతుకుతారు. అయితే ఇందుకు భిన్నంగా ఒక చిన్నారి బాలుడు తన హోమ్‌వర్క్ ను ఆనందంతో చేస్తున్న వీడియో తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఓ చిన్నారి మ్యాథ్స్ హోంవర్క్ చేస్తున్నట్టు వీడియోలో చూడవచ్చు. గణిత ప్రశ్నలను పరిష్కరిస్తున్నప్పుడు పిల్లవాడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరించాడు. ఇది చూడడానికి సరదాగా ఉంది. లెక్కలలో చిక్కులను తనదైన శైలిలో ఆడుకుంటూ సాల్వ్ చేస్తున్నాడు. అన్ని ప్రశ్నలకు చక చకా సమాధానాలు సంతోషంగా రాసుకున్నాడు. ఆ బాలుడిని చూస్తుంటే తన సమాధానం మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని.. ఎక్కడ తప్పు చేయలేదని భావిస్తున్నదని తెలుస్తోంది.

@NarendraNeer007 అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వ్యూస్, లైక్స్ లో హోరెత్తిపోతుంది. అంతేకాదు తమ బాల్యం గుర్తుకొచ్చింది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన తర్వాత, ఒకరు వ్యాఖ్యానిస్తూ, ‘చిన్న పిల్లలు చదువు అంటే పారిపోతూ.. ఆటలు, అల్లరి చేస్తూ కనిపిస్తారు. అయితే ఈ పిల్లవాడు సరదాగా హోమ్‌వర్క్ చేస్తున్నాడు’ అని అన్నారు. మరొకరు పిల్లలు అమాయకత్వం నిజంగా ఆకట్టుకుంటుంది.. ఇలా చేయమని ఆ బాలుడికి టీచర్ చెప్పినట్లు తెలుస్తోంది..  దానిని బాగా అర్థం చేసుకున్నాడని మరొకరు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. .

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌