AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taraka Ratna: ఎటువంటి మార్పు లేని తారకరత్న ఆరోగ్యం.. క్షేమం కోరుతూ ఫ్యాన్స్ ఆలయాల్లో పూజలు, టెంకాయలు కొట్టి, ప్రార్థనలు

తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ అభిమానులు పూజలు చేస్తున్నారు. సత్యసాయి జిల్లా కిరికెరలో, హిందూపూర్‌లో టీడీపీ నేతలు తారకరత్న కోలుకోవాలని పూజలు చేశారు. శివాలయంలో 121 టెంకాయలు కొట్టి, ప్రార్థనలు నిర్వహించారు.

Taraka Ratna: ఎటువంటి మార్పు లేని తారకరత్న ఆరోగ్యం.. క్షేమం కోరుతూ ఫ్యాన్స్ ఆలయాల్లో పూజలు, టెంకాయలు కొట్టి, ప్రార్థనలు
Taraka Ratna Nandamuri
Surya Kala
|

Updated on: Feb 01, 2023 | 9:32 AM

Share

గెట్‌ వెల్‌ సూన్. తారక రత్న కోసం యావత్ తెలుగు రాష్ట్రాల స్లోగన్. బెంగళూరులో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌పైనే ఉంచి తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు నారాయణ హృదయాలయ తన హెల్త్‌ బులెటిన్‌లో తారకరత్న హెల్త్‌ కండిషన్‌ వివరాలను వెల్లడించింది. మెదడుకి సంబంధించిన సిటి స్కాన్‌ చేసినప్పటికీ ఇంకా దానికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రతి విషయాన్నీ కుటుంబ సభ్యులతో చర్చించి వైద్యులు నిర్ణయం తీసుకుంటున్నారు. డాక్టర్‌ దేవిశెట్టి వైద్య బృందం నేతృత్వంలో వైద్యచికిత్సలు అందిస్తున్నట్టు కర్ణాక మంత్రి మునిరత్నం నాయుడు వెల్లడించారు.

మరోవైపు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ అభిమానులు పూజలు చేస్తున్నారు. సత్యసాయి జిల్లా కిరికెరలో, హిందూపూర్‌లో టీడీపీ నేతలు తారకరత్న కోలుకోవాలని పూజలు చేశారు. శివాలయంలో 121 టెంకాయలు కొట్టి, ప్రార్థనలు నిర్వహించారు. మొదటి రోజు ఎలాంటి పరిస్థితి ఉందో… ఇప్పటికి కూడా అదే కండీషన్‌ కొనసాగుతూ ఉంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్‌ అయితే లేదంటున్నాయి ఆస్పత్రి వర్గాలు. తారకరత్నకు మరోసారి బ్రెయిన్‌ అండ్‌ హార్ట్‌ టెస్టులు చేశారు. MRI స్కాన్‌తోపాటు కీలక పరీక్షలు నిర్వహించారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు బాలకృష్ణ. ఎప్పటికప్పుడు వైద్యులతో కోఆర్డినేట్‌ చేసుకుంటూ తారకరత్న హెల్త్‌ కండీషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. బాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులంతా హాస్పిటల్‌లోనే ఉంటూ తారకరత్న ఆరోగ్యం ఇంప్రూవ్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు హాస్పిటల్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. బెంగళూరులోని తెలుగువారితో పాటు టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద కర్ణాటక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తారకతర్న ఆరోగ్యపరిస్థితిపై కర్ణాటక ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది.

ఇవి కూడా చదవండి

తారకరత్నకు ఇంకా సపోర్టివ్‌ సిస్టమ్‌పైనే ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది. స్టెప్‌ బై స్టెప్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తూ ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వైద్యులు యత్నిస్తున్నారు. ఈ సమయంలో స్టంట్‌ వేస్తే మళ్లీ హార్ట్‌ ఎటాక్‌ రావొచ్చని వైద్యులు చెప్తున్నారు. క్రిటికల్‌ కండీషన్‌ నుంచి ఎప్పుడు బయటపడతారో చెప్పలేని పరిస్థితి. అసలు వెంటిలేటర్‌ అనేది ఎప్పుడు వాడతారు. ఎలాంటి పరిస్థితుల్లో అవసరం పడుతుంది. వెంటిలేటర్‌ స్టేజి వరకు వచ్చారంటే బతికే చాన్స్‌ ఏ మేరకు ఉందనే ఉత్కంఠ తారకరత్న అభిమానుల్లో నెలకొంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Career Astrology: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు పక్కా..!
Career Astrology: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు పక్కా..!
పెళ్లయిన ఏడాదికే గల్ఫ్‌ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై
పెళ్లయిన ఏడాదికే గల్ఫ్‌ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై
170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరంటే?
170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరంటే?
టీమిండియా బ్యాటర్లకు జోఫ్రా ఆర్చర్ స్ట్రాంగ్ కౌంటర్
టీమిండియా బ్యాటర్లకు జోఫ్రా ఆర్చర్ స్ట్రాంగ్ కౌంటర్
కొడుకు కోసం ఓ తల్లి యాగం.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం
కొడుకు కోసం ఓ తల్లి యాగం.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం
ఏళ్ళ తరబడి కీళ్ల వాతం నొప్పులతో బాధపడేవారికి ఈ పొడి గొప్ప ఔషధం..
ఏళ్ళ తరబడి కీళ్ల వాతం నొప్పులతో బాధపడేవారికి ఈ పొడి గొప్ప ఔషధం..
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఇబ్బందా..? గడ్కరీ క్లారిటీ
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఇబ్బందా..? గడ్కరీ క్లారిటీ
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. డైట్‌ ఛార్జీలు 10శాతం పెంపు
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. డైట్‌ ఛార్జీలు 10శాతం పెంపు
అద్భుతమైన రుచి అంటే ఇదే.. గుత్తివంకాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?
అద్భుతమైన రుచి అంటే ఇదే.. గుత్తివంకాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?
సంజూ శాంసన్ కోసం వైభవ్ సూర్యవంశీని పక్కన పెడతారా?
సంజూ శాంసన్ కోసం వైభవ్ సూర్యవంశీని పక్కన పెడతారా?