చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. తీరా ఏంటని చూసేలోపే ఊహించని సీన్.. అందరూ షాక్.!
మార్క్ తన స్నేహితుడిని అనుసరించి సముద్రంలోకి దూకి వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించలేదన్నారు. దీంతో కోస్ట్ గార్డ్ సహాయం కోసం పిలిచారు. మార్క్‌ని ఈడ్చుకెళ్లిన చేప అహి అని పిలువబడే పసుపు ఫిన్ ట్యూనా గుర్తించారు..
చేపల వేటకు వెళ్లిన 65 ఏళ్ల వ్యక్తిని ఒక పెద్ద చేప ఈడ్చుకెళ్లింది. ఈ సమాచారంతో అతని కోసం గత ఐదు రోజులుగా అన్వేషణ కొనసాగుతోంది. హవాయిలోని హోనానౌ తీరంలో ఆదివారం ఉదయం 65 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. అహి ట్యూనాను పట్టుకునే సమయంలో అతను తప్పిపోయినట్టుగా తెలిసింది. కోస్ట్ గార్డ్, హవాయి ఫైర్ రెస్క్యూ సంయుక్తంగా 65 ఏళ్ల మార్క్ నిటిల్ కోసం వెతుకుతున్నాయి. అతను చివరిసారిగా హోనానౌలో స్నేహితుడితో పడవలో కనిపించాడు. మార్క్ పెద్ద చేప అంటూ ఎర వద్దకు వెళ్లగా ఆ చేపను ఎరతో సహా అతన్ని ఈడ్చుకెళ్లినట్టుగా అతని స్నేహితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదడుగుల పొడవున్న మార్క్ దాదాపు 80 కిలోల బరువుంటాడు. కోస్ట్ గార్డ్ ఆదివారం నుంచి మార్క్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆచూకీ దొరికే వరకు గాలింపు కొనసాగిస్తామంటున్నారు. హెలికాప్టర్‌తో సహా ఒక బృందం గాలింపు చర్యల్లో పాల్గొంది వచ్చారు, అయితే వారు సముద్రంలో మార్క్‌ను కనుగొనలేకపోయారు. సముద్రంలో 515 మైళ్ల దూరం 65 గంటల పాటు 20కి పైగా సోదాలు నిర్వహించినట్లు కోస్ట్ గార్డ్ ఇప్పటికే పేర్కొంది. ఇలాంటి చేపలు పట్టే సమయంలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని డైవర్లు వివరిస్తున్నారు.
The @USCG and Hawaii County Fire Dept. are currently searching for a 65 year-old fisherman last seen wearing dark shorts and a dark shirt, Jan. 15, off Honaunau, Big Island.
Anyone with information is requested to contact Sector Honolulu at 808-842-2600. pic.twitter.com/T6rE5VEwqX
— USCG Hawaii Pacific (@USCGHawaiiPac) January 17, 2023
మార్క్,అతని స్నేహితుడు కెప్టెన్ కుక్ పడవలో చేపలు పట్టడానికి వెళ్లారు. మార్క్ నీటిలో పడిపోవడాన్ని స్నేహితుడు చూశానని చెప్పాడు. ఇది ఉదయం ఐదు గంటల ప్రాంతంలో. మార్క్ తన స్నేహితుడిని అనుసరించి సముద్రంలోకి దూకి వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించలేదన్నారు. దీంతో కోస్ట్ గార్డ్ సహాయం కోసం పిలిచారు. మార్క్‌ని ఈడ్చుకెళ్లిన చేప అహి అని పిలువబడే పసుపు ఫిన్ ట్యూనా గుర్తించారు.. ఇవి ఆరు అడుగుల పొడవు ఉంటాయని, సాధారణంగా 56 కిలోల నుండి 181 కిలోల బరువు కలిగి ఉంటాయని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..