AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi Electric Car: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెడుతున్న జియోమీ.. మొట్టమొదటి కార్ లుక్ ఇదే.. ఫొటోలు వైరల్..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ జియోమీ(Xiaomi) ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి అడుగుపెడుతోంది. తన మొదటి ఎలక్ట్రిక్ కారును ముస్తాబు చేస్తోంది. కాగా ఈ కారు కు సంబంధించిన కొన్ని చిత్రాలు చైనీస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Xiaomi Electric Car: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెడుతున్న జియోమీ.. మొట్టమొదటి కార్ లుక్ ఇదే.. ఫొటోలు వైరల్..
Xiaomi’s Ms11 Leaked Photo
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 01, 2023 | 1:18 PM

Share

ప్రపంచ అవసరాలు మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఇంధన కార్లకు డిమాండ్ ఏర్పడగా.. ఇప్పుడు క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో పలు దిగ్గజ కంపెనీలతో పాటు కొత్త కొత్త సంస్థలు కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈక్రమంలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ జియోమీ(Xiaomi) ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి అడుగుపెడుతోంది. తన మొదటి ఎలక్ట్రిక్ కారును ముస్తాబు చేస్తోంది. కాగా ఈ కారు కు సంబంధించిన కొన్ని చిత్రాలు చైనీస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సరికొత్త లుక్ లో కనిపిస్తున్న ఆ కారుపై ప్రజల్లో అంచనాలు పెంచేస్తున్నాయి.

పోటీ చాలా ఎక్కువ..

చైనా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో చాలా పోటీ ఉంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో గ్లోబల్ లీడర్ ఉన్న టెస్లా తో పాటు ప్రముఖ దిగ్గజ బ్రాండ్లు, కొన్ని స్థానిక బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయి. ఈ పోటీని తట్టుకోలేక చాలా కంపెనీలు వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నప్పటికీ ప్రయోజనం అంతంతమాత్రంగా ఉంది.

ముగింపు దశకు..

జియోమీ ఈవీ కారు తయారీ చివరి దశకు చేరింది. అనేక రకాల పరీక్షలను ఆ కంపెనీ ఈ కారుకు నిర్వహించింది. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో చైనాలో ఈ కారు దర్శనమిచ్చింది. అయితే సోషల్ మీడియాలో లభ్యమవుతున్న చిత్రాలను బట్టి ఈ కారు ఎంఎస్11 గా తెలుస్తోంది. అయితే దీనిపై ఎటువంటి క్లారిఫికేషన్ లేదు.

ఇవి కూడా చదవండి

లుక్ ఇలా..

సెడాన్ వేరియంట్లో వస్తున్న ఈకారు స్పోర్టీ లుక్ లో కనిపించే నాలుగు డోర్ల కారు. ఇది చైనాలోని పాపులర్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ బీవైడీ కి చెందిన సీల్ వేరియంట్ ను పోలి ఉంది. మోడల్ లో దీని ఛాయలు కనిపిస్తున్నాయి. అయితే హెడ్ లైట్ లు మాత్రం మెక్లారెన్ 720 ఎస్ ను పోలి ఉంది. టెస్లా మోడల్ 3, మోడల్ వై కారుల్లాగా పూర్తిగా గాజు పైకప్పుతో పాటు పెద్ద చక్రాలను కలిగి ఉంది. ఇది విల్‌వుడ్ బ్రేక్‌ల సెట్‌ను కూడా కలిగి ఉంది. అలాగే కారు ముందు భాగంలో LiDAR సెన్సార్‌ కనిపిస్తున్నందున, ఇది సెల్ప్ డ్రైవింగ్ సామర్థ్యాలతో వస్తుందని భావిస్తున్నారు. కారు లోపలి భాగాలకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు కేవలం బయటి లుక్ మాత్రమే అందిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..