Maruti Electric Cars: 2030 నాటికి ఆరు కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. మారుతీ సుజుకీ యాక్షన్ ప్లాన్ సిద్ధం..
ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లకు డిమాండ్ పెరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వేరియంట్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో మారుతీ సుజుకి కూడా ఈవీల తయారీని వేగవంతం చేయనున్నట్లు ప్రకటించింది.

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఇప్పటికే అందుకు సంబంధించిన కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు.. మనిషిని చుట్టేస్తున్న వాతావరణ కాలుష్యంతో ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లకు డిమాండ్ పెరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వేరియంట్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో మారుతీ సుజుకి కూడా ఈవీల తయారీని వేగవంతం చేయనున్నట్లు ప్రకటించింది. ఆలస్యంగానే మారుతీ నుంచి ఈవీ వాహనాలు వస్తున్నా.. 2030 నాటికి కనీసం ఆరు ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లను మార్కెట్ లోకి లాంచ్ చేసేలా ప్రణాళిక చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా ఆ కంపెనీ ప్రకటించింది. దానిలో కనిపించిన మోడళ్లు ఓ సారి చూద్దాం..
మారుతీ సుజుకీ ఈవీఎక్స్.. మారుతీ సుజుకి 2025 నాటికి eVX కాన్సెప్ట్ ఆధారంగా తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయనుంది. ఇది టాటా, మహీంద్రా నుండి పెద్ద ఈవీల వలె కాకుండా ఒక చిన్న మాస్-మార్కెట్ ఈవీ అవుతుంది. ఎస్ యూవీ మోడల్ లోని గుజరాత్ లోని దీనిని ఉత్పత్తి చేయనుంది. దీని కోసం టయోటా నుంచి సహకారం తీసుకుంటోంది. దీనిని భారతీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయంగా కూడా ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
వ్యాగన్ ఆర్ ఈవీ.. టీజర్ లో కనిపించిన రెండో కారు మారుతీ వ్యాగన్ ఆర్ ఈవీ. 2017 నుంచి వ్యాగన్ ఆర్ ను ఈవీగా తీసుకొచ్చేందుకు పరీక్షులు నిర్వహిస్తున్నారు. ఇది దాదాపు సిద్దమైనా ఎప్పుడు లాంచింగ్ అనేది ఇంకా తెలియలేదు.అయితే మారుతీ ఈవీఎక్స్ ఎస్ యూవీ కంటే ముందే వచ్చే అవకాశం ఉన్నట్లు టీజర్ ద్వారా స్పష్టం అవుతోంది.
మారుతీ ఫ్రాంక్స్ ఈవీ.. సుజుకి జిమ్నీ లాంచ్ చేయడంతో మారుతి ఫ్రాంక్స్ ఎస్ యూవీ పక్కకు వెళ్లిపోయింది. అయితే కస్టమర్లు మాత్రం దానిని వదలిపెట్టడం లేదు. రోజూ దాని కోసం కనీసం 300 ఆర్డర్లు వస్తుంటాయి. అయితే ఇది ఇప్పుడు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రాంక్స్ ఈవీ వెర్షన్ త్వరలో అందుబాటులో రానుంది. టీజర్ లో కనిపించిన మూడో మోడల్ ఇది.
హస్ట్ లర్ ఈవీ.. హస్ట్లర్ మాత్రం టీజర్‌లో ఊహించని కారు. టీజర్‌లో కనిపించిన లుక్ మాత్రం ఆ కారు కచ్చితంగా హస్ట్లర్ లాగే ఉంది. దీని ఫంకీ లుక్స్ కొంచెం వ్యాగన్ ఆర్ లాగా ఉంటుంది.
రెండు కార్లపై స్పష్టత లేదు.. టీజర్‌లో మిగిలిన రెండు కార్లపై సరైన క్లారిటీ లేదు. వాటి గురించి కచ్చితంగా చెప్పలేం గానీ ఒక సరికొత్త ఎస్ యూవీ అయ్యే అవకాశం ఉంది. అలాగే గ్రాండ్ విటారా లుక్ లో ఒకటి, స్విఫ్ట్ కారుకు దగ్గరగా ఆ మోడళ్లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..