Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple foldable iPad: యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐ ప్యాడ్ వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర, ఇతర వివరాలు..

యాపిల్ కంపెనీ మొబైల్ వాడటం అంటే అదొక స్టేటస్ సింబల్ గా కూడా భావించే వారు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ బ్రాండ్ కి అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే తన మొదటి ఫోల్డబుల్ ఐ ప్యాడ్ ను లాంచ్ చేసేందుకు ప్రణాళిక చేస్తోంది.

Apple foldable iPad: యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐ ప్యాడ్ వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర, ఇతర వివరాలు..
Ipad Fold
Follow us
Madhu

|

Updated on: Feb 01, 2023 | 1:45 PM

యాపిల్.. ఈ బ్రాండ్ అంటేనే యువతకు పిచ్చి. యాపిల్ కంపెనీ మొబైల్ వాడటం అంటే అదొక స్టేటస్ సింబల్ గా కూడా భావించే వారు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ బ్రాండ్ కి అభిమానులు ఉన్నారు. ఈ డిమాండ్ కు అనుగుణంగానే యాపిల్ సంస్థ కూడా అత్యాధునిక ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ తన బ్రాండ్ స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తన మొదటి ఫోల్డబుల్ ఐ ప్యాడ్ ను లాంచ్ చేసేందుకు ప్రణాళిక చేస్తోంది. వచ్చే ఏడాది దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేస్తోంది. ఇది కార్బన్ ఫైబర్ కిక్ స్టాండ్ తో రానునున్నట్లు తెలుస్తోంది.

2024లోనే వచ్చే అవకాశం..

యాపిల్ ఫోర్డబుల్ ఐప్యాడ్‌పై పాపులర్ టెక్ అనలిస్ట్ మింగ్ చి కువో ఓ ట్వీట్ చేశారు. 2024లో ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ కావచ్చని ఆయన అంచనా వేశారు. ఈ కొత్త మోడల్‌కు మంచి ఆదరణ ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిలో ఉంటుందని అంచనా వేస్తున్న కార్బన్ ఫైబర్ మెటీరియల్ కారణంగా ఈ హ్యాండ్‌సె‌ట్ బరువు తక్కువగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుందని చెప్పారు. అలాగే ఐప్యాడ్‌ల రవాణాను కూడా ఇది సులభతరం చేస్తుందని మింగ్- చి కువో ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే ఐప్యాడ్ షిప్‌మెంట్స్ ఇయర్-ఆన్-ఇయర్(YoY) 10-15 శాతం క్షీణత ఉంటుందని మింగ్- చి కువో అంచనా వేశారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో యాపిల్ కంపెనీ ఐప్యాడ్ మినీని రీడిజైన్‌తో భారీగా ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని, దీంతో రాబోయే 9-12 నెలల్లో ఈ సరికొత్త ఫోర్డబుల్ ఐప్యాడ్‌ను లాంచ్ చేసే అవకాశం ఉండకపోవచ్చని కువో పేర్కొన్నారు.

దాని స్థానంలోనే..

ఐప్యాడ్ మినీ ప్లేస్‌లో కంపెనీ ఫోల్డబుల్ ఐప్యాడ్‌ను తీసుకొస్తుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే అనలిస్ట్ మింగ్-చి కువో దీన్ని కొట్టిపారేశారు. ఐప్యాడ్ మినీతో పోలిస్తే ఐప్యాడ్ ఫోల్డబుల్ చాలా ఖరీదైనదని, ఒకదానితో మరో ప్రొడక్ట్‌కు సంబంధం లేదని వివరించారు.

ఇవి కూడా చదవండి

ఐప్యాడ్ మినీలో ఇవి..

రాబోయే న్యూ ఐప్యాడ్ మినీలో కొత్త ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, అది సెల్లింగ్ పాయింట్‌గా ఉంటుందని ఇప్పటికే కువో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఐప్యాడ్ మినీ 2021 సెప్టెంబర్‌లో లాంచ్ అయింది. ఇందులో 8.3-అంగుళాల డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్ సెట్, USB-C పోర్ట్, టచ్ ID పవర్ బటన్, సెల్యులార్ మోడల్‌ల్లో 5G సపోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ధర ఎంత ఉండొచ్చు..

ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ తేదీ, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన వివరాలను యాపిల్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఐప్యాడ్ ఫోల్డబుల్‌లో కార్బన్ ఫైబర్ కిక్‌స్టాండ్‌ ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనా వే స్తున్నారు. ఈ డివైజ్ కు సంబంధించిన ఇతర ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌పై రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం