Kajal Aggarwal : కొడుకుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాజల్ అగర్వాల్.. ఫోటోలు వైరల్‌

కాజల్‌కు తోడుగా ఆమె తల్లి కూడా ఉన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన కాజల్‌ని చూసేందుకు భక్తులు ఎబగబడ్డారు. దీంతో టిటిడి సిబ్బంది ఆమెకి భద్రత కల్పించారు.

Kajal Aggarwal : కొడుకుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాజల్ అగర్వాల్.. ఫోటోలు వైరల్‌
Kajal Aggarwal
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 01, 2023 | 10:36 AM

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన కొడుకుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు కాజల్‌. కొడుకు పట్టాక తొలిసారి తన కుమారుడితో కలిసి తిరుమలకు వచ్చిన కాజల్‌, ఆమె కుమారిడికి అర్చకులు వేద ఆశీర్వాదాలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.

కాజల్‌ తన కుమారుడితో ఆలయం వద్ద కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్‌కు తోడుగా ఆమె తల్లి కూడా ఉన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన కాజల్‌ని చూసేందుకు భక్తులు ఎబగబడ్డారు. దీంతో టిటిడి సిబ్బంది ఆమెకి భద్రత కల్పించారు.

కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక కాజల్ కుమారుడికి ‘నీల్ కిచ్లూ’ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. శంకర్ దర్శకుడు. కమల్ హాసన్ హీరో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..