విమానంలో బాంబు బెదిరింపు కాల్‌ కలకలం.. క్షణాల్లో విమానం టేకాఫ్ అవ్వబోతుండగా అకస్మాత్తుగా…

విమానంలో బాంబు ఉందనే సమాచారంతో అహ్మదాబాద్ విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. అలయన్స్ ఎయిర్ 91696 విమానంలో బాంబు ఉన్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేసి చెప్పటంతో విమానాశ్రయంలో హై టెన్షన్‌ నెలకొంది.

విమానంలో బాంబు బెదిరింపు కాల్‌ కలకలం.. క్షణాల్లో విమానం టేకాఫ్ అవ్వబోతుండగా అకస్మాత్తుగా...
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 01, 2023 | 9:59 AM

ఢిల్లీ-అహ్మదాబాద్ విమానంలో బాంబు బెదిరింపు కాల్‌ కలకలం రేపింది. విమానంలో బాంబు ఉందనే సమాచారంతో అహ్మదాబాద్ విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. అలయన్స్ ఎయిర్ 91696 విమానంలో బాంబు ఉన్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేసి చెప్పటంతో విమానాశ్రయంలో హై టెన్షన్‌ నెలకొంది. హుటాహుటినా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మరికొన్ని క్షణాల్లో విమానం టేకాఫ్ అవ్వబోతుండగా రన్‌వేపైకి వెళ్లకుండా ఆపేశారు అధికారులు.

విమానం ఉదయం 5:20 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, ఇంకా విమానం ఎక్కని ఓ ప్రయాణికుడిని అధికారులు ఎంటా అని ఆరా తీశారు. అందుకు సమాధానంగా అతడు.. విమానంలో బాంబు ఉందని, అందుకే తాను విమానం ఎక్కలేదని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి బాంబు కనిపించలేదు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బాంబు ఉందని బెదిరించిన వ్యక్తికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు జనవరి 21 న, రష్యా రాజధాని మాస్కో నుండి గోవాకు బయలుదేరిన చార్టర్డ్ విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించారు. రష్యాకు చెందిన అజూర్ ఎయిర్ చార్టర్ విమానంలో 2 మంది శిశువులు మరియు 7 మంది సిబ్బందితో సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..