AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను పాకిస్తాన్, ఆమె బంగ్లాదేశ్.. బుడ్డొడి పేరు మాత్రం ‘ఇండియా’.. ముద్దులొలికే చిన్నారిని చూసేయండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఫోటో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. నిజానికి ఇది విచిత్రమైన పేరు కాదు, ఎందుకంటే..

అతను పాకిస్తాన్, ఆమె బంగ్లాదేశ్.. బుడ్డొడి పేరు మాత్రం ‘ఇండియా’.. ముద్దులొలికే చిన్నారిని చూసేయండి..
India
Jyothi Gadda
|

Updated on: Jan 31, 2023 | 2:10 PM

Share

పిల్లల్ని పెంచడం అంత తేలికైన పని కాదు.. ముఖ్యంగా మొదటి బిడ్డ చేసే అల్లరితో తల్లిదండ్రులు పడే అవస్థలు మామూలుగా ఉండవు..అంతేకాదు, బిడ్డ అలనా పాలనా కోసం ఆ అమ్మనాన్నలు తీసుకునే జాగ్రత్తలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ చిన్నపిల్లలు తరచూ ఏదో ఒక అల్లరి చేయటం అలవాటుగా మార్చుకుంటారు. అది మొదట్లో సరదాగా అనిపించినా ఆ తరువాత తీవ్రమైన సమస్యలను సృష్టించవచ్చు. అలాంటి ఒక సంఘటనలో, బంగ్లాదేశ్-పాకిస్తానీ జంట తమ సరదా కష్టాలను పంచుకున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను నషీద్ సింగర్ ఒమర్ ఇసా ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఫోటోలో, వారి పిల్లవాడు మధ్యలో నిద్రపోతుండగా, భార్యాభర్తలు ఇరువైపులా కూర్చున్నారు. ఈ ఫోటో క్యాప్షన్‌గా వారు తమ కష్టాలు వివరించారు..

కొత్త తల్లిదండ్రులందరికీ ఒక హెచ్చరిక..ఎవరూ మాలాంటి తప్పు చేయకూడదని సూచించారు. అంతేకాదు.. ఈ దంపతులు రెండు వేర్వేరు దేశాలకు చెందిన వారు. తండ్రి బంగ్లాదేశ్‌కి చెందిన వ్యక్తి కగా, తల్లి పాకిస్తానీ. రెండు వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు భార్యభర్తలు వారికి పుట్టిన బిడ్డకు మరో దేశం పేరుపెట్టుకున్నారు. బాలుడికి ‘ఇండియా’ అని పేరు పెట్టారు. ఈ మేరకు పాకిస్తానీ గాయకుడు నషీద్‌ చెప్పారు. అయితే, బాలుడి అసలు పేరు ఇబ్రహీం. కానీ, వాడి పేరు ఇండియా అని మార్చేశారు. ఎందుకంటే..

India1

అయితే, బాలుడు చిన్నతనం నుంచి అమ్మనాన్నల మధ్యలోనే పడుకోవటం అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడూ ఇరువైపులా అమ్మనాన్నలు ఉంటేనే నిద్రపోయేవాడు. బాలుడికి ఉన్న ఈ అలవాటు పెద్దవాడైన తర్వాత కూడా అలాగే కొనసాగుతూ వచ్చింది. దీంతో వారు బాలుడి పేరు కూడా మార్చేశారు. తమ ఇద్దరినీ విడదీసి నిద్రపోతున్న బాలుడికి పాకిస్తానీ తల్లిని, బంగ్లాదేశ్‌ తండ్రికి మధ్యలో ఉంటున్న కొడుక్కి ఇండియా అని పేరుపెట్టారు దంపతులు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఫోటో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. నిజానికి ఇది విచిత్రమైన పేరు కాదు, ఎందుకంటే సెలబ్రిటీలు కూడా తమ పిల్లలకు నార్త్, వెస్ట్ వంటి విభిన్న పేర్లను ఎంచుకుంటారు. నిజానికి చాలా మంది తమ పిల్లలకు ఇండియా అని పేరు పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..