AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాతాళాన్ని చూడాలనుకుంటున్నారా?.. అక్కడి రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఈ గుహలోంచి వెళ్లండి..

ఈ రహస్యమైన గుహను చూసేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. దర్శనం కోసం యాత్రికులు గంటల తరబడి వేచి ఉంటారు. ఈ గుహలో ప్రపంచం అంతానికి సంబంధించిన లోతైన రహస్యం దాగి ఉందని నమ్ముతారు.

పాతాళాన్ని చూడాలనుకుంటున్నారా?.. అక్కడి రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఈ గుహలోంచి వెళ్లండి..
Patal Bhuvaneshwar Cave
Jyothi Gadda
|

Updated on: Feb 01, 2023 | 8:21 AM

Share

ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన అద్భుతం. ఇది స్వతహాగా చాలా అందమైన ప్రదేశం. ఇక్కడకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇక్కడ అంతే అంతుచిక్కని, చాలా రహస్యమైన విషయాలు దాగి ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని అటువంటి పురాతన గుహ ఒకటి ఉంది. అదే పాతాళ భువనేశ్వర్ గుహ..దీని రహస్యం నేటికీ చాలా మందికి తెలియదు. ఈ గుహను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీని రహస్యాలు విని ఆశ్చర్యపోతారు. ఈ గుహ దేవాలయం రహస్యాల నిలయం. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో ఉంది. ఇక్కడకు వెళ్లడానికి చాలా ఇరుకైన రహదారి ఉంటుంది. ప్రతిచోటా రాళ్లు ఉంటాయి. ఇది పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ గుహ గురించి, ఇక్కడకు చేరుకునే మార్గం గురించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలోని గంగోలిహాట్ నుండి 14 కి.మీ దూరంలో నిర్మించబడింది. పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం సముద్ర మట్టానికి 90 అడుగుల దిగువన ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కనుగొన్నారని చెబుతారు. శంకరాచార్యులు ఇక్కడ ఒక రాగి శివలింగాన్ని స్థాపించారు. ఆలయానికి వెళ్లే ముందు మేజర్ సమీర్ కత్వాల్ స్మారకం మీదుగా వెళ్లాలి. ఆలయ ప్రవేశం గ్రిల్ గేట్ నుండి ప్రారంభమవుతుంది. గుహలాంటి ఈ దేవాలయం మార్గం చాలా సన్నగా ఉంటుంది. ఈ గుహలోని రాళ్లపై ఏనుగు లాంటి కళాకృతులు కనిపిస్తాయి. ఇక్కడ రాళ్లపై సర్ప రాజు బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ ఒక పురాతన గుహ ఉంది. ఇది నేటికీ ప్రజలకు మిస్టరీగా మిగిలిపోయింది. ఈ గుహ భారతదేశంలోని పురాతన గ్రంథాలలో కూడా వివరించబడింది. ఈ గుహలో ప్రపంచం అంతానికి సంబంధించిన లోతైన రహస్యం దాగి ఉందని నమ్ముతారు.

Patal Bhuvaneshwar

పురాణాల ప్రకారం ఈ ఆలయంలో రాండ్వార్, పాపద్వార్, ధర్మద్వార్, మోక్షద్వార్ అనే నాలుగు ద్వారాలు ఉన్నాయి. రావణుడు చనిపోయినప్పుడు పాపద్వారాన్ని మూసేశారని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత రణరంగం కూడా మూసివేశారు. ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాన్ని ఆదిగణేష్ అని అంటారు. గుహలోని నాలుగు స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలను సూచిస్తాయని చెబుతారు.మూడు సైజుల స్తంభాలలో మార్పు లేదు. కానీ కలియుగ స్తంభం పొడవు ఎక్కువ. అంటే దాని ఆకృతిలో మార్పు ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం కూడా నిరంతరం పెరుగుతుందని చెబుతారు. ఈ రహస్యమైన గుహను చూసేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. దర్శనం కోసం యాత్రికులు గంటల తరబడి వేచి ఉంటారు. ఇక్కడ ఒకేసారి 15 మంది మాత్రమే లోపలికి వెళ్లగలుగుతారు.

ఇక్కడి వెళ్లలనుకునేవారికి విమాన సౌకర్యం కూడా ఉంది. విమానంలో వెళ్లాలనుకుంటే నైని సైనీ విమానాశ్రయంలో దిగాలి. ఈ ఆలయం ఇక్కడికి 91 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. మీరు రైలులో వస్తే, మీరు కత్గోడం వరకు రైలులో వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుండి 192 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో రావాలనుకునే వారు అల్మోరా, బిన్సార్, జగేశ్వర్, కౌసాని, నైనిటాల్ మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..