ఏపీ రాజకీయాల్లో ఫోన్‌ట్యాపింగ్‌ దుమారం.. కోటం రెడ్డికి మరో సవాల్‌ వేసిన మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో ఖచ్చితంగా కాల్ రికార్డే... టాపింగ్ ఎంత మాత్రం కాదు... కాల్ రికార్డు అని నేను నిరూపిస్తానంటూ మాజీ మంత్రి, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసులురెడ్డి కౌంటర్ ఇచ్చారు..

ఏపీ రాజకీయాల్లో ఫోన్‌ట్యాపింగ్‌ దుమారం.. కోటం రెడ్డికి మరో సవాల్‌ వేసిన మాజీ మంత్రి బాలినేని
Balineni Srinivasa Reddy
Follow us

|

Updated on: Feb 01, 2023 | 12:45 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కాకరేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని కోటంరెడ్డి ఆరోపించగా.. దీనిపై మాజీ మంత్రి, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసులురెడ్డి ఘాటుగా స్పందించారు. కోటంరెడ్డి ఆడియో విడుదలపై  బాలినేని శ్రీనివాసులురెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే టిడిపి పార్టీలోకి వెళ్ళిపోవచ్చని బాలినేని అన్నారు.. మంత్రి పదవో, స్పీకర్‌ పదవో ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదన్నారు… కోటంరెడ్డి కన్నా సీనియర్లు నెల్లూరులో చాలామంది ఉన్నారు… ఇలా అయితే నల్లపురెడ్డి ఏమనుకోవాలని ప్రశ్నించారు… ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు టిడిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు..ఆనంకు భద్రత తగ్గించారని అనడంలో వాస్తవం లేదు… మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కూడా ఆనంకు ఇచ్చినట్టే భద్రత కల్పించారు.

కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో ఖచ్చితంగా కాల్ రికార్డే… టాపింగ్ ఎంత మాత్రం కాదు… కాల్ రికార్డు అని నేను నిరూపిస్తా… కోటంరెడ్డి పోటీ నుంచి తప్పుకుంటాడా… అని సవాల్‌ విసిరారు… ఒకవేళ టాపింగని రుజువైతే నేను కూడా పోటీ నుంచి తప్పుకుంటా… నా సవాల్ ని స్వీకరిస్తావా… అని ప్రశ్నించారు …కోటంరెడ్డి స్నేహితుడే ఆ కాల్ రికార్డ్ ని ఇచ్చాడు…కోటంరెడ్డి స్నేహితుడిని మీడియా ముందు ప్రవేశపెడతాం. ఏది నిజమో ఏది అబద్దమో తేలిపోతుందన్నారు…

ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆడియో రికార్డును చూపించి బెదిరించలేదని, ఆ ఆడియో రికార్డు ద్వారా ఎందుకు ఇలా చేశావని అధిష్టానం కోటంరెడ్డిని ప్రశ్నించిందన్నారు… కోటం రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తారా లేదా అన్నది అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు… 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు తమ ఫోన్లు కూడా టాపింగ్ అవుతున్నాయని కోటంరెడ్డిని ఫోన్లో సంప్రదించారనడంలో వాస్తవం లేదని బాలినేని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..