AP CM Jagan: వైసీపీలో కోటంరెడ్డి కలకలం.. నెల్లూరు రాజకీయాలపై సీఎం జగన్ ఫోకస్.. కాసేపట్లో కీలక సమావేశం
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారన్న చర్చలు, కీలక నేతలతో కాసేపట్లో సీఎం జగన్ సమావేశం. నెల్లూరు రాజకీయంలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌పై కీలక వ్యాఖ్యలను చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి రానున్న ఎన్నికల్లో 175 సీట్లు దక్కించుకోవాలని నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.. మరోవైపు అనేక జిల్లాలో వైసీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నారు. తాజాగా నెల్లూరుజిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. తాజా రాజకీయ సమీకరణాలపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్, రీజినల్ కో ఆర్డినటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి తో మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. కొటెంకి ప్రత్యర్థిగా బలమైన నేతను సిద్ధం చేస్తున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం జరిగే భేటీలో ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారన్న చర్చలు, కీలక నేతలతో కాసేపట్లో సీఎం జగన్ సమావేశం. నెల్లూరు రాజకీయంలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌పై కీలక వ్యాఖ్యలను చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో సీఎం జగన్ రంగంలోకి దిగారు. కీలక నేతలతో మీటింగ్ నిర్వహించబోతున్నారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజక వర్గ ఇంచార్జ్‌గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించబోతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకు ఆదాల? రూరల్ నియోజక వర్గానికి ఆయననే ఎందుకు నియమిస్తున్నారు? ఆనం విజయ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు పరిశీలనలోకి వచ్చినా ఆదాలను ఎంపిక చేయడంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రూరల్ నియోజకం వర్గంలో కోటంరెడ్డికి చెక్ పెట్టాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి సరైన నేత అని భావిస్తున్నారు సీఎం జగన్. గతంలో ఆయన టీడీపీ నియోజక వర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్ రాబోతుందన్న పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు ఆదాల ప్రభాకర్ రెడ్డి.
ఆదాలకు కాకుండా ఆనం విజయ్ కుమార్ రెడ్డికి నియోజక వర్గ బాధ్యతలు అప్పగిస్తే కోటం, ఆనం మధ్య ఉన్న వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో కోటంరెడ్డిదే పై చేయి అవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదాలకు రూరల్ నియోజక వర్గాన్ని అప్పగించబోతున్నారు. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్‌గా నేదురుమిల్లి రామ్‌కుమార్‌ను నియమించారు సీఎం జగన్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పుడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి. మనస్సులో ఏదో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కోటంరెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..