Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: డైమండ్ పాప వ్యాఖ్యలపై మంత్రి రోజా సీరియస్.. లోకేశ్ ను అంకుల్ అంటూ..

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. పాదయాత్ర తొలినాళ్లల్లో మంత్రి రోజాపై నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. డైమండ్ పాప..

Minister Roja: డైమండ్ పాప వ్యాఖ్యలపై మంత్రి రోజా సీరియస్.. లోకేశ్ ను అంకుల్ అంటూ..
Rk Roja
Follow us
Ganesh Mudavath

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2023 | 3:41 PM

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. పాదయాత్ర తొలినాళ్లల్లో మంత్రి రోజాపై నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. డైమండ్ పాప అని సంబోధించారు. కాగా.. ఆ కామెంట్స్ పై తాజాగా మంత్రి రోజా స్పందించారు. డైమండ్ పాప అన్న లోకేశ్ ను.. లోకేశ్ అంకుల్ అని సెటైర్ వేశారు. యువగళం పాదయాత్ర చేస్తున్న పప్పునాయుడు తండ్రి రాష్ట్రానికి ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో చెప్పకుండానే నడుస్తున్నాడని విమర్శించారు. తండ్రి సీఎం గా ఉండగా దోచుకొని హైదరాబాద్ లో దాచుకోవడమే కాకుండా తన తండ్రిని మళ్ళీ సీఎం పీఠం ఎక్కించేందుకు లోకేశ్ అంకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక వైపు తన తండ్రి చంద్రబాబు.. కాంగ్రెస్ తో కుమ్మక్కై ముఖ్యమంత్రి జగన్ ను వేధించినా.. జగన్ ఆత్మస్ధైర్యంతో పాదయాత్ర చేసి పేదల కష్టాలను వింటూ అధికారంలో వచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు.

పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్.. ప్రజల కష్టాలు విన్నారు. అధికారంలోకి వచ్చాక వారి కష్టాలు తీరుస్తున్నారు. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఓట్లు అడుగుతున్నాం. తండ్రీ కొడుకులు అవసరం వచ్చినప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకుని, అధికారం వచ్చాక వాళ్ళను విస్మరిస్తున్నారు. అది వాళ్లు గుర్తించలేక పోతున్నారు. సెక్యూరిటీ, వాలంటీర్లు లేక పోతే 10 మంది కూడా లోకేశ్ పాదయాత్రలో ఉండరు. లోకేశ్ ది యువగళం కాదు. ఒంటరి గళం. లీడర్ గా 100 శాతం ఫెయిల్యూర్. ఇది మంగళగిరి ప్రజలు గుర్తించే ఓడించారు. తండ్రి సీఎంగా, లోకేశ్ మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యే గా గెలవలేని రికార్డు సొంతం చేసుకున్నారు.

– రోజా, ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. గతంలో నారా లోకేశ్ మంత్రి రోజాను ఉద్ధేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు “డైమండ్ పాప” క్షమాపణలు చెప్పాలని నారా లోకేష్ చురకలు అంటించారు. తనకు చీర, గాజులు పంపిస్తానని మహిళలను అగౌరవపరిచేలా రోజా మాట్లాడారని.. చీర, గాజులు పంపాలని ఆ డైమండ్‌ పాపకు చెప్పానని నారా లోకేశ్ గుర్తు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..