ఉగ్రదుశ్చర్యలో భార్యాపిల్లలను కోల్పోయి సామజిక సేవ బాటపట్టిన డాక్టర్.. 30 ఏళ్లుగా కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రశేఖర్

గత 30 ఏళ్లుగా విశిష్ట సేవలను అందిస్తూ.. లక్షలాది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రశేఖర్ ను విశిష్టిత పురష్కారం వరించింది. కెనడాలో శాస్త్రవేత్తగా స్థిర పడిన చంద్రశేఖర్.. మళ్ళీ సొంత గడ్డపై అడుగు పెట్టి సామజిక సేవ దిశగా అడుగులు వేయడానికి కారణం.. ఆయన జీవితంలో ఎదురైన విషాద ఘటనే..  

ఉగ్రదుశ్చర్యలో భార్యాపిల్లలను కోల్పోయి సామజిక సేవ బాటపట్టిన డాక్టర్.. 30 ఏళ్లుగా కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రశేఖర్
Dr Sankurathri Chandrasekhar
Follow us

|

Updated on: Jan 30, 2023 | 12:14 PM

ఎవరి జీవితం ఏ విధంగా సాగుతుందో ఎవరికీ తెలియదు.. ఎంతో అందంగా సంతోషముగా సాగుతున్న జీవితంలో అనుకోని దుర్ఘటనలు చోటు చేసుకుంటే..ముఖ్యంగా కుటుంబం సభ్యులు మరణిస్తే.. వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొందరు విషాదం నుంచి కోలుకోవడానికి తమ జీవన విధానాన్ని మలచుకుంటారు. మరికొందరు.. తమ కుటుంబం సభ్యులను పది మందిలో చూసుకుంటూ.. వారికీ తమకు వీలైనంత సేవ చేస్తూ.. జీవితాన్ని అర్ధవంతం చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ఒకరు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఎంపిక చేసింది. గత 30 ఏళ్లుగా విశిష్ట సేవలను అందిస్తూ.. లక్షలాది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రశేఖర్ ను విశిష్టిత పురష్కారం వరించింది. కెనడాలో శాస్త్రవేత్తగా స్థిర పడిన చంద్రశేఖర్.. మళ్ళీ సొంత గడ్డపై అడుగు పెట్టి సామజిక సేవ దిశగా అడుగులు వేయడానికి కారణం.. ఆయన జీవితంలో ఎదురైన విషాద ఘటనే..

సంకురాత్రి చంద్రశేఖర్ స్వస్థలం కాకినాడ. రాజమండ్రిలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎస్సీ చేసి.. , పైచదువుల కోసం కెనడా వెళ్లారు. జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేసి అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. 1975లో కాకినాడకు చెందిన మంజరితో వివాహం జరిగింది. చంద్రశేఖర్, మంజరి దంపతులకు శ్రీ కిరణ్ (6) అనే కుమారుడు, శారద (3) అనే కుమార్తెలు. 1985లో భార్యాబిడ్డలను భారత్ పంపించేందుకు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ఎయిరిండియా విమానం ఎక్కించారు.

ఆ విమానం పేరు ఎంపరర్ కనిష్క-182. ఖలిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చంద్రశేఖర్  భార్య మంజరి, కుమార్తె శారద, కుమారుడు శ్రీకిరణ్‌లు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన తర్వాత 1988లో కాకినాడ వచ్చిన ఆయన.. సమాజసేవకు పూనుకున్నారు.పేద ప్రజలకు ఫ్రీ మెడికల్, ఎడ్యుకేషన్ అందిస్తూ సమాజ సేవకు కృషి చేశారు.

ఇవి కూడా చదవండి

3500 మంది పేదపిల్లలకు చదువుకునే వీలుని కల్పించారు. 1993లో శ్రీ కిరణ్ నేత్ర విజ్ఞాన సంస్థను ప్రారంభించి సుమారు 13 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్సను అందించారు. గత 30 ఏళ్లుగా చంద్ర శేఖర్ పేదల కళ్లల్లో వెలుగులు పంచుతూ, ఆ ఆనందంలోనే తన భార్యాబిడ్డలను చూసుకుంటూ, నిస్వార్థంగా వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. ఆయన చేస్తోన్న విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మ శ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..