Vande Bharat Express: గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలు! ట్రయిల్ రన్ పూర్తి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మరో వందేభారత్ రైలు పట్టాలెక్కేందుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో సికింద్రాబాద్-తిరుపతి..

Vande Bharat Express: గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు! ట్రయిల్ రన్ పూర్తి
అంటే సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.
Follow us

|

Updated on: Jan 30, 2023 | 9:30 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మరో వందేభారత్ రైలు పట్టాలెక్కేందుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు లాంచనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం ఈ రూట్‌లో ముందస్తుగా ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ ట్రైన్ చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా.. ఒంగోలు ఉదయం 5.20కి, చీరాల ఉదయం 6.25 గంటలకు, విజయవాడ ఉదయం 8.25 గంటలకు చేరుకుంది. ఇక సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడవనున్న ఈ వందేభారత్ రైలు దేశంలోని 9వ ట్రైన్ కానుంది. కాగా, సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్ – విశాఖపట్నం మద్య వందేభారత్ రైలును కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.