Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: విజయ్ దేవరకొండ అభిమానులకు సారీ చెప్పిన సమంత.. ఎందుకంటే ?..

ఇప్పటికే సామ్.. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం ఆకట్టుకుంది. ఇక మధ్యలోనే సామ్ మయోసైటిస్ భారిన పడడంతో చిత్రీకరణకు బ్రేక్ చెప్పేసింది. అయితే ఇప్పుడు కాస్త కోలుకున్న సమంత..

Samantha: విజయ్ దేవరకొండ అభిమానులకు సారీ చెప్పిన సమంత.. ఎందుకంటే ?..
Samantha, Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2023 | 3:02 PM

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటుంది. చాలా కాలం తర్వాత శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో మీడియా ముందుకు వచ్చింది. పూర్తిగా మారిపోయి.. గ్లాసెస్ .. చేతిలో జపమాలతో కొత్త లుక్‏లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు తాను వర్కవుట్స్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ.. తన తదుపరి ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఇస్తూ.. మళ్లీ ఫాలోవర్లతో ఇంట్రాక్ట్ అవుతుంది. అలాగే సామ్ తిరిగి తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్‏లలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమైనట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే సామ్.. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం ఆకట్టుకుంది. ఇక మధ్యలోనే సామ్ మయోసైటిస్ భారిన పడడంతో చిత్రీకరణకు బ్రేక్ చెప్పేసింది. అయితే ఇప్పుడు కాస్త కోలుకున్న సమంత.. తిరిగి ఖుషి చిత్రీకరణలో పాల్గొంటుందని అంతా భావించారు. కానీ ఆమె ఈ సినిమా షూటింగ్ కాకుండా.. బాలీవుడ్ లో రూపొందుతున్న సిటాడెల్ చిత్రంలో పాల్గొననున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా అయిన సిటాడెల్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మేన్ దర్శకులు రాజ్ అండ్ డీకే దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత.. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రీకరణలో సామ్ పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో విజయ్ దేవరకొమడ చిత్రానికి సమంత డేట్స్ ఇవ్డవం లేదంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా సమంతను ప్రశ్నించారు. మరీ ఖుషి పరిస్థితేంటీ ? ఓ నెటిజన్ అడగ్గా సామ్ స్పందించింది.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు. ఖుషి షూటింగ్ ను అతి త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నాం అంటూ గుడ్ న్యూస్ చెప్పేసింది. దీంతో దేవరకొండ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామ్.. నెటిజన్ ట్వీట్ కు విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. పూర్తి ఆరోగ్యంతో.. చిరునవ్వుతో తిరిగి వచ్చేవరకు ఎదురుచూస్తుంటాం అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి ఖుషి సినిమాపై అప్డేట్ రావడంతో సామ్.. విజయ్ ఫ్యాన్స్ హ్యాప్పీ ఫీలవుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.