Happy Birthday Brahmanandam: కామెడీకి నిలువెత్తు నిదర్శనం.. హాస్యబ్రహ్మీకి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్..

నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈరోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం.

Happy Birthday Brahmanandam: కామెడీకి నిలువెత్తు నిదర్శనం.. హాస్యబ్రహ్మీకి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్..
Bramhanandam, Megastar Chir
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2023 | 2:44 PM

టాలీవుడ్ హాస్యబ్రహ్మా బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు హాస్య నటుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందంకు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. “నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈరోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చెయ్యక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లి విరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు. బ్రహ్మనందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ.. పది మందిని నవ్విస్తూ ఉండాలని.. బ్రహ్మానందంకి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండాలని..తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్పూర్తిగా ఆశిస్తూ.. తనకి నా జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.

తెలుగు చిత్రపరిశ్రమలో బ్రహ్మానందం గురించి ప్రత్యేక చెప్పక్కర్లేదు. వందల చిత్రాల్లో తన కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. ప్రతి సినిమాలోనూ తన నటనతో.. కామెడీతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేవారు. బ్రహ్మానందం ఒక్కరున్నారంటే సినిమాలో కామెడీకి కొదువుండదు అనే నమ్మకం దర్శకనిర్మాతలలో ఉండిపోయింది. ఆయన డేట్స్ కోసం స్టార్ హీరోస్ వెయిట్ చేసేవారు. కేవలం డైలాగ్స్ తోనే కాదు.. తన ఫేస్ ఎక్స్‏ప్రెషన్స్‏తోనే కామెడీని పండించేవారు. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు లిఖించుకున్నాడు బ్రహ్మానందం.

ఇవి కూడా చదవండి

హాస్య నటుడుగానే కాదు.. ఇప్పటి తరానికి ఆయన మీమ్స్ దేవుడు. సోషల్ మీడియాలో ట్రోల్స్.. మీమ్స్ అంటే ఠక్కున ఆయన ఫేస్ గుర్తొచ్చేస్తోంది. ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఆయన ఇటీవల పంచతంత్రం సినిమాతో సందడి చేశారు. ఇక ఇప్పుడు ఆయన రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తోన్న కీడా కోలా మూవీలోనూ బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో బ్రహ్మీ వరదరాజు పాత్రలో కనిపించనున్నారు. పేరు వరదా.. పోసేది పితుకంత అంటూ క్యాప్షన్ జత చేసి రిలీజ్ చేసిన ఫోస్టర్ చూస్తే ఈ చిత్రంలో మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయినట్లు కనిపిస్తున్నారు బ్రహ్మీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే