Mangli: రెమ్యునరేషన్ పెంచేసిన మంగ్లీ.. ఒకొక్క పాటకు ఇప్పుడు ఎంత వసూల్ చేస్తుందంటే
బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది మంగ్లీ. ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ తో అలరించింది. జానపద గీతాలతో మంగ్లీకి మంచి పాపులారిటీ వచ్చింది.
టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా రాణిస్తోన్న వారిలో మంగ్లీ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి.. ఆ తర్వాత బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది మంగ్లీ. ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ తో అలరించింది. జానపద గీతాలతో మంగ్లీకి మంచి పాపులారిటీ వచ్చింది. చిత్తూరు జిల్లా సుంకిడికి చెందిన మంగ్లీ అసలు పేరు.. సత్యవతి రాథోడ్. అయితే తెలంగాణలో మంగ్లీగా మారి తెలంగాణ యాసలో ఫోక్ సాంగ్స్ పాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు అందుకుంది. మంగ్లీ పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది మంగ్లీ. ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమా చేయనుంది ఈ భామ.
ఇదిలా ఉంటే తాజాగా మంగ్లీ రెమ్యునరేషన్ పెంచేసింది ఒక వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఒకొక్క పాటకు లక్ష రూపాయిలు తీసుకునే మంగ్లీ.. ఇప్పుడు ఏకంగా 2 నుంచి 3 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందని టాక్.
తెలుగు ఇండస్ట్రీలో టాప్ అండ్ మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా ఎదిగిన మంగ్లీ.. మొదట్లో తెలంగాణ యాసలో పాడేది. తర్వాత బతుకమ్మ పాటలతో పాపులర్ అయింది. ఇప్పుడు వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారింది మంగ్లీ.