Trisha: సూపర్ హిట్ జోడీ రిపీట్..14 ఏళ్ల తర్వాత ఆ హీరోతో జత కట్టనున్న త్రిష.. స్పెషల్ వీడియో అదిరిపోయింది..

తాజాగా ఆమె దాదాపు 14 ఏళ్ల తర్వాత తమిళ్ స్టార్ హీరోతో జత కట్టబోతుంది. ఇదే విషయాన్ని సదురు సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ వీడియో షేర్ చేశారు.

Trisha: సూపర్ హిట్ జోడీ రిపీట్..14 ఏళ్ల తర్వాత ఆ హీరోతో జత కట్టనున్న త్రిష.. స్పెషల్ వీడియో అదిరిపోయింది..
Trisha
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2023 | 4:15 PM

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మలుపు తిప్పింది. ఈ చిత్రంలో ఆమె లుక్స్ వెండితెరపై స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష అందం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోయిన త్రిష.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడం.. వ్యక్తిగత కారణాలతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. పలు చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. ఇక ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఇప్పుడు త్రిషకు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ఇప్పటికే ఆమె పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. తాజాగా ఆమె దాదాపు 14 ఏళ్ల తర్వాత తమిళ్ స్టార్ హీరోతో జత కట్టబోతుంది. ఇదే విషయాన్ని సదురు సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ వీడియో షేర్ చేశారు.

ఇటీవలే వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి .. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంతో దళపతి 67 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఈ సినిమాలోని నటీనటుల గురించి కొద్ది రోజులుగా అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, ప్రియా ఆనంద్ జాయిన్ కాగా.. తాజాగా త్రిష కూడా నటిస్తున్నట్లు తెలిపారు. గతంలో విజయ్, త్రిష కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ కలిసి అలరించబోతున్నారు. వీరిద్దరి సినిమాలకు సంబంధించిన పలు సీన్స్ అన్నింటిని కలిపి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్