AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: తన చిరునవ్వు వెనుక ఆ మూడు కారణాలున్నాయా ?.. అందమైన ఫోటోతో ఆసక్తికర పోస్ట్ చేసిన సాయి పల్లవి..

గత కొద్ది రోజులుగా సాయి పల్లవి సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది. అంతేకాకుండా ఆమె నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ కూడా రాలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. తాజాగా ఓ అందమైన ఫోటో షేర్ చేస్తూ నెట్టింట యాక్టివ్ అయ్యింది ఈ బ్యూటీ.

Sai Pallavi: తన చిరునవ్వు వెనుక ఆ మూడు కారణాలున్నాయా ?.. అందమైన ఫోటోతో ఆసక్తికర పోస్ట్ చేసిన సాయి పల్లవి..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2023 | 3:45 PM

Share

అందం.. అభినయం ఆమె సొంతం. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా.. కంటెంట్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని సహాజ నటి సౌందర్యను గుర్తుచేసింది. సంప్రదాయంగా కనిపిస్తూనే.. నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వరుస ఆఫర్లు వస్తున్నా.. మనసుకు నచ్చిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. సినిమా హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా.. నచ్చిన ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవికి ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగుతోపాటు.. మలయాళం.. తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో చివరిసారిగా విరాట పర్వం సినిమాతో సందడి చేసింది. ఆ తర్వాత హీరో సూర్య నిర్మించిన గార్గి మూవీతో అలరించింది. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి నటనకు సినీ విశ్లేషకులు సైతం ముగ్దులయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా సాయి పల్లవి సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది. అంతేకాకుండా ఆమె నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ కూడా రాలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. తాజాగా ఓ అందమైన ఫోటో షేర్ చేస్తూ నెట్టింట యాక్టివ్ అయ్యింది ఈ బ్యూటీ.

తన ఇంట్లో సోఫాలో కూర్చుని మనస్పూర్తిగా నవ్వులు చిందిస్తూన్న ఫోటో షేర్ చేస్తూ.. జీవితంలో చిరునవ్వులు.. ఆశ.. కృతజ్ఞత ఉంటే చాలంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఇక చాలా కాలం తర్వాత సాయి పల్లవి అందమైన పిక్ షేర్ చేయడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. సాయి పల్లవి ఫోటోకు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే కొద్ది రోజులుగా సాయి పల్లవికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె సినిమాలు మానేసిందని.. తన చెల్లితో కలిసి హాస్పిటల్ నిర్మించి.. చదువులు పూర్తిచేయాలని భావిస్తోందని.. అలాగే నటనకు దూరంగా ఉండి.. డాక్టర్ కావాలనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ రూమర్స్ పై ఇప్పటివరకు సాయి పల్లవి స్పందించలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!