Dreams: మీకు కలలో ఇవి కనిపిస్తే మంచి టైమ్ మొదలైనట్టే.. వద్దన్నా అదృష్టం వరిస్తుందట..
నిద్రలో కలలు రావడమనేది సర్వసాధారణం. అయితే, కలలు కొన్ని మంచివి, మరికొన్ని చెడువి ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన పురోగతికి సంబంధించి వచ్చే కలలు ఎంతో ఉత్సహాన్ని కలిగిస్తాయి.
నిద్రలో కలలు రావడమనేది సర్వసాధారణం. అయితే, కలలు కొన్ని మంచివి, మరికొన్ని చెడువి ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన పురోగతికి సంబంధించి వచ్చే కలలు ఎంతో ఉత్సహాన్ని కలిగిస్తాయి. అయితే. కలలపై కొంతమంది కొంతమంది విశ్వాసంతో ఉంటారు. మరికొంతమంది అస్సలు నమ్మరు.. ఏదీ ఏమైనా కలలో వచ్చేవి నిజజీవితంలో అస్సలు జరగకపోయినా.. అవి కొంతమందిని సంతోషపరుస్తాయి. కానీ కొన్ని కలలు చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలు శుభమైన సంకేతాలు ఇస్తాయి. ఎలాంటి కలలు వస్తే అదృష్టం వరిస్తుంది.. ఎలాంటి కలలు వస్తే శుభపరిణామం నెలకొంటుంది.
మీకు ఎప్పుడైనా కల వస్తే.. ఉదయం నిద్రలేవగానే మళ్లీ మళ్లీ అదే కలను గుర్తుకు తెచ్చుకుంటూ దాని అర్థం కోసం ఆరాతీస్తుంటారు. అయితే, రాత్రి వచ్చే కలలు మన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు సూచనలు, సంకేతాలంటున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మతపరమైన గ్రంథాలు: కలలో ఏదైనా మతపరమైన గ్రంధాలు చూసినట్లయితే అది చాలా శుభ సంకేతం. ఈ పుస్తకం ఏదైనా మతానికి సంబంధించినది కావచ్చు.. ఇంకా మీరు సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం. ఏదైనా ప్రాథమిక ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనే ప్రయత్నం కావచ్చు అని పేర్కొంటున్నారు.
- బైక్ రైడ్ (ద్విచక్ర వాహనంపై ప్రయాణం) : మీ కలలో సైకిల్ తొక్కుతూ మీరు ఎక్కడికైనా వెళుతుంటే అది కూడా శుభానికి చిహ్నం. అంటే మీ శ్రమ బలంతో మీరు జీవిత లక్ష్యం వైపు పయనిస్తున్నారని అర్థం. మీరు సరైన దిశలో వెళుతున్నారని విశ్వసించవచ్చు. కానీ, ఎప్పటికప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది కావున.. దాని కోసం మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి.
- బిస్కెట్లు: కలలో ఏదైనా బిస్కెట్‌ని చూసినట్లయితే అది మీకు శుభం. అది ఫలవంతమైన కల అని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి కల త్వరలో ఏదైనా బహుమతిని పొందే అవకాశం ఉందని సూచన.. బిస్కెట్ అనేది జీవితంలో మధురమైన అనుభవానికి చిహ్నం.
- పువ్వులు: కలలో పువ్వును చూడటం శుభానికి చిహ్నం. పువ్వు ఆనందం, సంతృప్తి, యవ్వనానికి చిహ్నం. అయితే ఈ ఆనందం తాత్కాలికమే.
- గోరు కొరకడం లేదా కత్తిరించడం: గోర్లు కత్తిరించినా, లేదా కొరుతున్నట్లు వచ్చే కల కూడా మంచిదేనట.. ఇలా చేయడం ద్వారా మీ రుణం త్వరగా తగ్గుతుంది లేదా పూర్తి అవుతుందని అర్ధం అని స్వప్న శాస్త్రం పేర్కొంటోంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాగానమే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పాఠకుల ఆసక్తి మేరకు ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్మాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..