Pathaan: బాక్సాఫీస్‌‌ను షేక్ చేస్తున్న బాద్‌షా.. రికార్డ్స్ తిరగరాస్తోన్న పఠాన్ కలెక్షన్స్..

షారూఖ్‌ఖాన్‌ పఠాన్‌ సినిమాకు కలెక్షన్ల పంట పండుతోంది . వారం రోజుల్లో ఈ సినిమా రూ. 634 కోట్లను వసూలు చేసింది. త్వరలో 1000 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరబోతోందని సమాచారం..

Pathaan: బాక్సాఫీస్‌‌ను షేక్ చేస్తున్న బాద్‌షా.. రికార్డ్స్ తిరగరాస్తోన్న పఠాన్ కలెక్షన్స్..
Pathaan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 01, 2023 | 9:11 PM

బాక్సాఫీస్‌ దగ్గర పఠాన్‌ సినిమాకు కలెక్షన్ల పంట పండుతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీకే భారీ హిట్ గా నిలిచింది. పఠాన్‌ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పుటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 634 కోట్ల కలెక్షన్లను అందుకున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలో రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరబోతోంది. ఇండియా నుంచే 395 కోట్లు రాగా ఓవర్సీస్ నుంచి 239 కోట్లు వసూళ్లు అందుకుని బాలీవుడ్ హిస్టరీ లో అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని వండర్స్ నమోదు చేస్తుందని కూడా ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

పఠాన్‌ సినిమాలో జాన్ అబ్రహం విలన్ గా నటించారు. యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం ట్రేడ్ అనలిస్టులు, పండితుల అంచనాలను మంచి కలెక్షన్లు సాధిస్తోంది. విడుదలైన అన్ని దేశాల్లో రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్‌గా, యాక్షన్ సినిమాగా పఠాన్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. నటీనటుల పారితోషికం, ఇతర ఖర్చులతోసహా ఈ సినిమాను 260 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. పఠాన్‌ సినిమా షారుక్ ఖాన్‌కు తొమ్మిదేళ్ల తర్వాత విజయాన్ని అందించింది.

పఠాన్ సినిమా టీజర్లు, ట్రైలర్లు, వివాదాస్పద అంశాలు క్రేజ్ పెంచాయి. నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ సినిమా రావడం, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను ఇండియాలో 5500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అంచనాలకు మించి ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో కింగ్‌ ఖాన్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..