- Telugu News Photo Gallery Business photos EPFO Nominee Process: Follow these steps to change EPF new nomination online
EPFO ఉద్యోగులకు బిగ్ అలెర్ట్.. మీ నామినీ వివరాలను ఇలా మార్చుకోవచ్చు తెలుసా..? ఇప్పుడే ట్రై చేయండి..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులైతే.. అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.
Updated on: Jan 31, 2023 | 1:01 PM

ఇప్పుడు 5 సంవత్సరాల ముందు పీఎఫ్ ఉపసంహరణ చేస్తే, ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే TDS 30% ఉండగా.. దానిని 10% శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. ఇది EPFOలోని రికార్డులతో PAN అప్‌డేట్ చేయని వ్యక్తులకు సహాయపడుతుంది.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు PAN లింక్ చేయకపోతే, ఉపసంహరణ సమయంలో 30 శాతానికి బదులుగా 20 శాతం TDS విధిస్తారు. ఈ నియమం 1 ఏప్రిల్ 2023 నుంచి వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ నియమం పాన్ కార్డు జతచేయని ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం లభిస్తుంది.

5 సంవత్సరాలలోపు ఉపసంహరణకు పన్ను విధింపు: పీఎఫ్ ఉపసంహరణ 5 సంవత్సరాలలోపు చేస్తే, అప్పుడు పన్ను విధిస్తారు. ఐదేళ్ల తర్వాత ఉపసంహరణలపై పన్ను మినహాయింపు ఉంటుంది.

UAN నెంబర్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్, చందదారుని వివరాలు ఉండాలి. చిరునామా, ఫోటో, EPFO ప్రొఫైల్ కలిగి ఉండాలి.

నామినీ కోసం: ఆధార్ కార్డు, స్కాన్ చేసిన ఫోటో, బ్యాంకు ఖాతా సంఖ్య, IFSC కోడ్, చిరునామా రుజువు లాంటివి తప్పనిసరి.

PF ఉపసంహరణపై TDSని నివారించడానికి, ఫారమ్ 15G/ఫారమ్ 15Hని సమర్పించవచ్చు. ఫారమ్ 15G/ఫారం 15H, EPF ఉపసంహరణ మొత్తంపై TDSని నివారించడం కోసం ఇస్తారు. ఈ క్రమంలో PAN కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ఉద్యోగుల ఖాతాకు పాన్ కార్డును లింక్ చేసి ఉంటే 10% TDS విధిస్తారు. పాన్ కార్డ్ లింక్ చేయకుంటే 30% ఉన్న TDS ను 10శాతం తగ్గించి.. 20శాతంగా చేశారు.

'వివరాలను అందించండి' ట్యాబ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, 'సేవ్ చేయి'పై క్లిక్ చేయండి. 'కుటుంబ వివరాలను జోడించు' ఎంపికపై క్లిక్ చేసి, నామినీ(ల)ని వివరాలను జోడించండి. 'నామినీ వివరాలు' ఎంపికపై క్లిక్ చేసి, నామినీ(ల) వాటాను పొందుపరచండి

'సేవ్ EPS నామినేషన్' బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు, OTPని రూపొందించడానికి 'E-సైన్'పై క్లిక్ చేయండి. ఆ తర్వాత OTP మీ ఆధార్-లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వస్తుంది. దానిని సమర్పించండి.

ఇలా సింపుల్ గా నామినీ వివరాలను జోడించవచ్చు.





























