AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water: మంచినీళ్లు తాగడానికి కూడా టైమ్ కావలి గురూ..! బ్రష్ చేసే ముందు వాటర్ తాగొచ్చా.. లేదా..?

కొందరు పొద్దున్నే లేచిన తర్వాత పళ్లు తోముకోకుండా నీళ్లు తాగుతారు. మరికొందరు పళ్లు తోముకున్న తర్వాత నీళ్లు తాగుతారు. అటువంటి పరిస్థితిలో బ్రష్ చేయడానికి ముందు నీరు తాగడం మంచిదా లేక.. బ్రష్ చేసిన తర్వాత నీరు తాగడం మంచిదా..?

Water: మంచినీళ్లు తాగడానికి కూడా టైమ్ కావలి గురూ..! బ్రష్ చేసే ముందు వాటర్ తాగొచ్చా.. లేదా..?
Water
Shaik Madar Saheb
|

Updated on: Jan 31, 2023 | 1:39 PM

Share

జీవనశైలి, శరీర అవసరాలను బట్టి ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. మనలో చాలా మంది చల్లటి నీరు తాగుతారు. కానీ ఆయుర్వేదం మాత్రం గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట గోరువెచ్చని నీటిని తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది శరీరాన్ని లోపల నుంచి ఎన్నో సమస్యలను నయం చేస్తుంది. ఇంకా జీవక్రియను, జీర్ణక్రియను పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ నాలుగు లీటర్లకు పైగా నీళ్లు తాగాలని సూచిస్తారు నిపుణులు..

కొందరు పొద్దున్నే లేచిన తర్వాత పళ్లు తోముకోకుండా నీళ్లు తాగుతారు. మరికొందరు పళ్లు తోముకున్న తర్వాత నీళ్లు తాగుతారు. అటువంటి పరిస్థితిలో బ్రష్ చేయడానికి ముందు నీరు తాగడం మంచిదా లేక.. బ్రష్ చేసిన తర్వాత నీరు తాగడం మంచిదా..? ఏది ప్రయోజనకరంగా ఉంటుంది.. అనేది ప్రశ్న చాలామందికి తలెత్తుతుంటుంది. ఇప్పుడు ఆ విషయాలను తెలుసుకుందాం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం బ్రష్ చేయకుండా నీటిని తాగడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది. దీని వల్ల మీరు రోజులో ఏది తిన్నా బాగా జీర్ణం అవుతుంది. ఇది కాకుండా బ్రష్ చేయకుండా నీటిని తాగడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉదయం వేళ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. రోజంతా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది కాకుండా, పొట్టకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీరు తరచుగా జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలతో బాధపడుతుంటే, ప్రతిరోజూ ఉదయం బ్రష్ చేయకుండానే నీటిని త్రాగండి.
  • పొడవాటి, మందపాటి జుట్టు, మెరిసే చర్మం కోసం ఉదయం బ్రష్ చేయకుండా నీరు తాగాలి. అంతే కాకుండా మలబద్ధకం, నోటిపూత, పుల్లని త్రేనుపు సమస్య కూడా దూరమవుతుంది.
  • నోటి దుర్వాసన ఉన్నవారు ఉదయాన్నే నిద్రలేచి ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. లాలాజలం లేకపోవడం వల్ల మన నోరు పొడిగా మారుతుంది. దీంతో బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా నోటి నుంచి చెడు వాసన వస్తుంది.
  • ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచి ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Follow Us
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
నాని సినిమాలో ఛాన్స్ అలా మిస్సయ్యింది.. నాగ దుర్గ..
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
23 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్ట్ సిరీస్ కొట్టిన వెస్టిండీస్
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
ఫ్రెంచ్ అధికారి పేరుతో HYDలో పెద్ద ఏరియా! మూసారామ్‌బాగ్ చరిత్ర
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
పీఎఫ్ వడ్డీ మీకు వచ్చిందా..? లేదా..? ఇలా చెక్ చేస్కోండి..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
ఆ హీరో సినిమాలో ఛాన్స్.. మూడు రోజుల్లో షూటింగ్ అని చెప్పి..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
రూ. 6నుండి రూ7లక్షల బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్, సేఫ్టీ ఇచ్చే కార్లు
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..