Viral News: అప్పుడు నోరూరించే మసాలా దోశ, టేస్టీ కాఫీ ఎంతో తెలుసా..? చూస్తే మీరు లొట్టలేస్తారు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jan 30, 2023 | 11:48 AM

సోషల్ మీడియా ఎన్నో వింతలకు వేదికగా మారుతోంది. నిత్యం పలు వీడియోలు, ఫొటోలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి.

Viral News: అప్పుడు నోరూరించే మసాలా దోశ, టేస్టీ కాఫీ ఎంతో తెలుసా..? చూస్తే మీరు లొట్టలేస్తారు..
Masala Dosa, Coffee
Follow us

సోషల్ మీడియా ఎన్నో వింతలకు వేదికగా మారుతోంది. నిత్యం పలు వీడియోలు, ఫొటోలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. 90 శతాబ్దం నాటి పెళ్లి కార్డుల నుంచి పాత వాహనాల బిల్లుల వరకు అనేక రకాల రశీదులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల బుల్లెట్, సైకిల్ కి సంబంధించిన బిల్లు కూడా నెట్టింట హల్ చల్ చేసింది. ఇదే సమయంలో పాత కరెంటు బిల్లు నుంచి తిండి, పానీయాల బిల్లుల వరకు అన్ని చర్చనీయాంశంగా మారాయి. అందుకే ఈ రోజుల్లో నెటిజన్లు పాత-కాలపు స్లిప్పుల ఫోటోలను క్లిక్ చేసి.. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ప్రజల స్పందనలు అద్భుతంగా ఉంటున్నాయి.. బిల్లు పాతది అయినప్పటికీ నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపించడం చర్చనీయాంశంగా మారింది.

తాజాగా.. ఇంటర్నెట్‌లో అటువంటి బిల్లు ఒకటి హల్ చల్ చేస్తోంది. అది జూన్ 28, 1971 నాటి బిల్లు. మసాలా దోసె, కాఫీ ధర బిల్లులో రాసి ఉంది. ఇది చూస్తే.. మీ మనస్సును కలిచివేస్తుంది. ఎందుకంటే.. బిల్లులో మసాలా దోస ధర ఒక్క రూపాయి అని రాసి ఉంటుంది. అదేవిధంగా, కాఫీ ధరను కూడా రూ.1 అని రాసి ఉండటాన్ని చూడవచ్చు. టిఫిన్, కాఫీ కలిపి మొత్తం ధర రూ.2 మాత్రమే ఉంది. బిల్లులో సర్వీస్ ట్యాక్స్ 6 పైసలు, సర్వీస్ ఛార్జీ 10 పైసలు తీసుకున్నారు. బిల్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ ఫొటో..

ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @indianhistory00 అనే యూజర్ షేర్ చేయగా.. దీనిపై నెటిజన్లు భిన్నమైన ప్రతిచర్యలు ఇస్తున్నారు. ఈ పోస్ట్ ఫిబ్రవరి 1, 2017న షేర్ చేగా.. దీన్ని చూసి వినియోగదారులు ఆశ్చర్యపోయారు. ఈ ద్రవ్యోల్బణం యుగంలో ఆనాడు కేవలం రెండు రూపాయలకు ఫుల్ టిఫిన్ లభించిన ఈ బిల్లును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అలాంటి టిఫిన్ దొరకాలంటే.. సింపుల్ గా రూ.80 పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu