Gold Price: 64 ఏళ్ల క్రితం బంగారం ధర చాక్లెట్ అంత చౌక.. 10 గ్రాముల ధర తెలిస్తే షాక్ అవుతారు

వైరల్ అవుతున్న ఈ పాత బిల్లు.. దాదాపు 64 ఏళ్ల నాటిది అని తెలుస్తోంది. ఆ సమయంలో ఇప్పటి చాక్లెట్ ధర కంటే అప్పుడు బంగారం చౌకగా ఉండేదనిపిస్తుంది చూసిన వారికి ఎవరికైనా.

Gold Price: 64 ఏళ్ల క్రితం బంగారం ధర చాక్లెట్ అంత చౌక..  10 గ్రాముల ధర తెలిస్తే షాక్ అవుతారు
Gold Rate India Viral News
Follow us

|

Updated on: Jan 30, 2023 | 11:01 AM

పాత బిల్లులకు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ బిల్లు నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోని చూసిన ప్రజలను ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుంది. తినే ఆహారం నుంచి అన్ని వస్తువుల ధరలు అంబరాన్ని తాకుతున్నాయి. బంగారం సామాన్యుల చేతుల్లో నుంచి దూరమైంది. ప్రస్తుతం ఉన్న ధరను చూస్తే.. ఇప్పుడు సామాన్యులు కొనే ఆలోచన కూడా మదిలోకి రానివ్వరు. అయితే బంగారం ధరకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. దాదాపు 60 ఏళ్ల క్రితం..  బంగారం కొన్న బిల్లు వైరల్‌ అయింది. ఈ బిల్లులోని బంగారం ధర చూస్తే.. ఆ రోజులు అంత బాగుండేవి అన్న మాట అంటూ కామెంట్ చేస్తారు.

వైరల్ అవుతున్న ఈ పాత బిల్లు.. దాదాపు 64 ఏళ్ల నాటిది అని తెలుస్తోంది. ఆ సమయంలో ఇప్పటి చాక్లెట్ ధర కంటే అప్పుడు బంగారం చౌకగా ఉండేదనిపిస్తుంది చూసిన వారికి ఎవరికైనా. నేడు తులాల బంగారం ధర 50 వేలు దాటగా .. అప్పట్లో తులం బంగారం ధర కేవలం రూ.113 మాత్రమే.. ఈ బిల్లును నిశితంగా పరిశీలిస్తే.. 64 ఏళ్లనాటిదని..  ఈ బిల్లు పుణె జిల్లాకు చెందినదని తెలిసిపోతుంది. మహారాష్ట్రకు చెందిన ఓ నగల వ్యాపారి పేరు పైన పేర్కొనబడింది. దుకాణం పేరు M/s వామన్ నింబాజీ అష్టేకర్ అని ఆ బిల్లు ద్వారా తెలుస్తోంది.

ఆరు దశాబ్దాల నాటి బంగారు బిల్లు

ఇవి కూడా చదవండి
64 Years Gold Bill

64 Years Gold Bill

స్లిప్‌పై తేదీ 03 మార్చి 1959 అని వ్రాయబడింది. అప్పట్లో బంగారం కొనుగోలు చేసిన వ్యక్తి పేరు శివలింగ్ ఆత్మారామ్. ఆత్మారాం బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసినట్లు బిల్లు ద్వారా తెలుస్తుంది. వీటి మొత్తం రూ.909 ఖరీదు.

ఆరు దశాబ్దాల నాటి ఈ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ బిల్లును నేటి బిల్లుతో పోల్చి చూస్తున్నారు. ఈ బిల్లును చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మంచి రోజులు అలాగే ఉండేవి..’ అని వ్యాఖ్యానించగా, ‘ఈ రోజు మంచి చాక్లెట్‌ కూడా రాదన్నారు. మరొకరు.. ‘ఈ బిల్లులో పన్ను కూడా కలిపారని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..