Switzerland of India: మంచు దుప్పటి కప్పుకున్న అరుణాచల్ ప్రదేశ్.. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాకు స్వాగతం పలుకుతున్న మంత్రి
ఉదయించే సూర్యుని భూమి అరుణాచల్ ప్రదేశ్ మీకు ఎల్లప్పుడూ స్వాగతం చెబుతుందన్నారు. పర్వతాలు, లోయలు వంటి అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. చిగు రిసార్ట్ మంచుతో కప్పబడిన పర్వతాలు, పైన్ చెట్లతో ప్రకృతి అందాలను కలిగి ఉంది.
నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ సోషల్ మీడియాలో పాపులర్ వ్యక్తి. ఏ మంత్రికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉంటారు. చమత్కారము, ప్రవర్తన కలగలిసిన ప్రవర్తనతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ నెటిజన్లు అత్యంత అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారారు. పబ్లిక్ ఫిగర్స్ మరెవ్వరికీ లేనంత ఆకర్షణను సొంతం చేసుకున్న మంత్రి ఇమ్నా అలాంగ్ సోషల్ మీడియాలో ఏ కొత్త పోస్ట్ చేసినా వెంటనే అది వైరల్ అవుతుంది. నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నాకి ట్విట్టర్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. అతని పోస్ట్‌లు తరచుగా వినోదాత్మకంగా ఉంటాయి. మరికొన్ని సార్లు ప్రజలకు ఏదొక సందేశాన్ని అందిస్తాయి.
ఇటీవలి మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అరుణాచల్ ప్రదేశ్‌లో మంచుతో కప్పబడిన అనినికి సంబంధించిన కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. ఇది కాశ్మీర్, స్విట్జర్లాండ్ లు కాదు.. నాగాలాండ్ కు పొరుగు రాష్ట్రం అయిన అరుణాచల్ ప్రదేశ్ లోని అందమైన ప్రాంతాలు. అరుణాచల్ ప్రదేశ్‌లో అనినిలో కొత్తగా పూర్తయిన చిగు రిసార్ట్.. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాకు పర్యాటకులకు స్వాగతం.. అద్భుతమైన సుందరమైన ప్రదేశం అంటూ ఫోటోలకు కామెంట్ చేశారు.
ये हसीं वादियां…!?
This ain’t Switzerland nor Kashmir!
This is the newly completed Chighu Resort at Anini, Arunachal Pradesh. Such a wonderful site! Isn’t it?@PemaKhanduBJP Ji when are you inviting me ?
To visit, contact: https://t.co/dg7PdIAkrn#AmazingNortheast pic.twitter.com/CKbGAtzrXo
— Temjen Imna Along (@AlongImna) January 28, 2023
టెమ్‌జెన్ ఇమ్నా చేసిన పోస్టుకి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ వెంటనే స్పందించారు. “ప్రియమైన టెమ్‌జెన్ ఇమ్నాకి అందమైన .. ఉదయించే సూర్యుని భూమి అరుణాచల్ ప్రదేశ్ మీకు ఎల్లప్పుడూ స్వాగతం చెబుతుందన్నారు. పర్వతాలు, లోయలు వంటి అందాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. చిగు రిసార్ట్ మంచుతో కప్పబడిన పర్వతాలు, పైన్ చెట్లతో ప్రకృతి అందాలను కలిగి ఉంది. అరుణాచల్ మీ రాక కోసం వేచి ఉంది! రండి అంటూ నాగాలాండ్ మంత్రికి సీఎం సాదర స్వాగతం చెప్పారు.
రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా.. పర్యాటకులను కట్టుకునేలా సీఎం పెమా ఖండూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. “దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని కొన్ని ప్రదేశాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. మంచుతో కప్పబడిన ఇళ్ల పైకప్పులు, మంచు, చల్లటి గాలి, చిగు రిసార్ట్ హిమపాతంలో కప్పబడి ఉన్నాయి. ఈ సుందరమైన ప్రదేశాన్ని సందర్శించండని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..