Viral Video: రొమాంటిక్ సాంగ్‌తో తన జీవితంలోకి వధువుకి వెల్కమ్ చెప్పిన వరుడు.. నెట్టింట్లో వీడియో వైరల్

పాకిస్థాన్‌కు చెందిన ఓ కొత్త జంట వేదికపై పెళ్లిదుస్తుల్లో అందంగా అలంకరించుకొని కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో వరుడు వధువు ముందు కూర్చుని అతిథులందరూ చూస్తుండగానే ఓ రొమాంటిక్‌ సాంగ్‌ అందుకున్నాడు.

Viral Video: రొమాంటిక్ సాంగ్‌తో తన జీవితంలోకి వధువుకి వెల్కమ్ చెప్పిన వరుడు.. నెట్టింట్లో వీడియో వైరల్
Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 28, 2023 | 11:36 AM

ఇటీవల పెళ్లి వేడుకల్లో వధూవరులు రకరకాల విన్యాసాలు చేయడం పరిపాటిగా మారింది. సాధారణంగా పెళ్లంటేనే ఎంతో సందడి, సరదాగా సాగే కార్యక్రమం. చుట్టాలు, బంధుమిత్రులలో ఎంతో కోలాహలంగా మారుతుంది పెళ్లి వేదిక. అయితే ప్రస్తుత కాలంలో వధూవరులు తమ వివాహాన్ని ఓ మధురజ్ఞాపకంగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారు వేదికపై చేసే చిలిపి చేష్టలు నెట్టింట షేర్‌ చేసుకుంటూ నెటిజన్లకు సైతం ఆనందాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలో ఓ వరుడ తనకు కాబోయే భార్యకోసం ఓ రొమాంటిక్‌ సాంగ్‌ ఆలపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

ఈ వీడియోలో పాకిస్థాన్‌కు చెందిన ఓ కొత్త జంట వేదికపై పెళ్లిదుస్తుల్లో అందంగా అలంకరించుకొని కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో వరుడు వధువు ముందు కూర్చుని అతిథులందరూ చూస్తుండగానే ఓ రొమాంటిక్‌ సాంగ్‌ అందుకున్నాడు. పెండ్లికొడుకు స‌మి ర‌షీద్ తన కాబోయే భార్య ఎదుట గిటార్‌ ప్లే చేస్తూ అమీర్‌ఖాన్‌, కాజోల్‌ నటించిన ఫనా మూవీలోని చాంద్‌ షిఫారస్‌.. పాటను ఎంతో హృద్యంగా పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. వరుడి పెర్‌ఫార్మెన్స్‌కి వధువు సిగ్గుతో మురిసిపోయింది. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సమయంలో అతిథులంతా తమ హర్షధ్వానాలతో వరుడిని అభినందించారు. అద్భుతమైన ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్‌ చేస్తూ శుభాకాంక్షల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..