AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు.. బౌలింగ్‌లో 2 వికెట్లు.. వర్షన్ 2.0తో దూకుడు పెంచిన ఆల్‌రౌండర్..

IND vs NZ Washington Sundar: కివీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టీమ్ ఇండియా ఓటమి పాలైనప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ తన ఆటతో రాంచీ మైదానంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన వేలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

Video: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు.. బౌలింగ్‌లో 2 వికెట్లు.. వర్షన్ 2.0తో దూకుడు పెంచిన ఆల్‌రౌండర్..
Team India Players
Follow us
Venkata Chari

|

Updated on: Jan 28, 2023 | 12:25 PM

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ ధాటికి కివీస్ జట్టు ఆరు వికెట్లకు 176 పరుగులు చేయగలిగింది. సమాధానంగా టీమ్ ఇండియా పూర్తి 20 ఓవర్లు ఆడినా 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 29న లక్నోలో జరగనుంది. టీమ్ ఇండియా ఓటమి పాలైనప్పటికీ వాషింగ్టన్ సుందర్ తన ఆటతో అభిమానుల మనసు దోచుకున్నాడు.

బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడింటిలోనూ సుందర్ అద్భుత ఆటను కనబరిచాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో సుందర్‌ రెండు వికెట్లు తీశాడు. ఆ ఓవర్ రెండో బంతికి సూర్యకుమార్ యాదవ్ రూపంలో ప్రమాదకరమైన ఫిన్ అలెన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి మార్క్ చాప్‌మన్‌ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను చిరుత వేగంతో అందుకుని షాక్ ఇచ్చాడు. ఈ క్యాచ్‌ని తన కుడివైపుకి దూకి పట్టాడు. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

బ్యాట్‌తో మరోసారి అద్భుతం..

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 115 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అప్పుడు టీమ్ ఇండియా 150 పరుగులు కూడా చేయగలదా అని అనిపించింది. కానీ, వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీతో ఇన్నింగ్స్ ఆడి భారత్ ను లక్ష్యానికి చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 28 బంతుల్లో ఐదు ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. సుందర్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం గమనార్హం. అంతకుముందు సుందర్ 32 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 47 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

సుందర్‌పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్ హార్దిక్..

భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ యంగ్ ఆల్ రౌండర్‌పై ప్రశంసల జల్లులు కురిపించాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, ‘సుందర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ తీరు చూస్తుంటే ఈ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ వాషింగ్టన్‌లా అనిపించింది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల వ్యక్తి అవసరం. అది మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అక్షర్ పటేల్, సుందర్ ఇలాగే ఆడితే టీమ్ ఇండియా ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

శ్రీలంక సిరీస్‌తో నో ఛాన్స్..

ఈ నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అక్షర్ పటేల్ స్పిన్ ఆల్ రౌండర్ పాత్ర పోషించడంతో 23 ఏళ్ల వాషింగ్టన్ సుందర్‌కు ఆ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. ఆ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లో అక్షర్ 117 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు. పెళ్లి కారణంగా అక్షర్ పటేల్ న్యూజిలాండ్ సిరీస్‌కు విరామం ఇవ్వడంతో వాషింగ్టన్ సుందర్ ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తనదైన ముద్ర వేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?
మెడపై నలుపును చిటికెలో వదిలించే చిట్కాలివిగో.. ట్రై చేసి చూడండి..
మెడపై నలుపును చిటికెలో వదిలించే చిట్కాలివిగో.. ట్రై చేసి చూడండి..
రాజస్థాన్‌లోని టోంక్.. ఫ్యామిలీ టూర్‎కి బెస్ట్.. ఏమి చూడాలంటే.?
రాజస్థాన్‌లోని టోంక్.. ఫ్యామిలీ టూర్‎కి బెస్ట్.. ఏమి చూడాలంటే.?
IPL 2025: 14 ఏళ్లకే 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీనే మార్చేసిన బుడ్డోడు..
IPL 2025: 14 ఏళ్లకే 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీనే మార్చేసిన బుడ్డోడు..
నటరాజన్‌ ను అందుకే ఆడించడం లేదన్న పీటర్సన్..
నటరాజన్‌ ను అందుకే ఆడించడం లేదన్న పీటర్సన్..
ఐదు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్టు..
ఐదు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్టు..