Viral Video: ఓర్నీ.. ఇదేం గెటప్‌ అక్క..! పెళ్లికూతురు హెయిర్‌స్టైల్‌కి నెటిజన్ల నోరూరుతోందిగా..

కానీ ఆమె హెయిర్‌ స్టైలే పిచ్చిగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్‌ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ సందడి చేస్తోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.

Viral Video: ఓర్నీ.. ఇదేం గెటప్‌ అక్క..! పెళ్లికూతురు హెయిర్‌స్టైల్‌కి నెటిజన్ల నోరూరుతోందిగా..
Crazy Hairdo
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 28, 2023 | 11:19 AM

ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని ఆశిస్తుంటారు. ఇక అమ్మాయిలతై అందంగా, గ్రాండ్‌గా కనిపించాలని కోరుకుంటారు. ఈ రోజుల్లో వధూవరులు తమ వివాహాలను వైవిధ్యంగా చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఈ వధువు కూడా సరిగ్గా అదే చేయాలనుకుంది. కానీ, ఆమె ప్లాన్ అట్టర్‌ ప్లాప్‌ అయినట్లు కనిపిస్తోంది. హెయిర్‌స్టైలిస్ట్ వధువుకు అందమైన జడవేస్తున్న వీడియో ఇది. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ జడను చూస్తే మాత్రం నెటిజన్లకు నోరు ఊరిపోతుందంటున్నారు..ఫన్నీ కామెంట్స్‌ హోరెత్తిస్తున్నారు. ఇదేం హెయిర్‌ స్టైల్‌రా బాబు అనుకుంటూ నెటిజన్లను తెగ నవ్వుకుంటున్నారు. ఇలాంటి హెయిర్ స్టైల్ ఇంతకు ముందు ఎక్కడా, ఎప్పుడూ చూసినట్లుగా లేదు. ఈ వీడియోను 5 మిలియన్లకు పైగా వీక్షించారు.

అవును, ఇంతకీ జడ చూస్తే నోరు ఊరటం ఏంటనే సందేహం కలిగింది కదా మీకు..? ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, వధువు తన ప్రత్యేకమైన కేశాలంకరణను ప్రదర్శించింది. కిట్‌క్యాట్, 5స్టార్, ఫెర్రెరో రోచర్, మిల్కీ బార్ వంటి చాక్లెట్‌లతో ఆమె జడను అలంకరించారు. అవును, మీరు విన్నది నిజమే. పువ్వులతో అలంకరించాల్సిన జుట్టును మీరు తరచూ చూస్తూనే ఉంటారు. కానీ, ఇలాంటి ప్రత్యేకమైన కేశాలంకరణ మరెక్కడా చూసి ఉండరు..ఇది పూర్తిగా ప్రత్యేకమైనది. ఆమె జుట్టు మాత్రమే కాదు, ఆమె చెవిపోగులు, కాలి పట్టీలు, చెవి కమ్మలు, నెక్లెస్‌తో పాటు అన్ని ఆభరణాలు చాక్లెట్స్‌తో తయారు చేసినవే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

న‌వ‌వ‌ధువు హెయిర్‌స్టైల్‌పై నెటిజ‌న్లు షాక్‌ అవుతున్నారు. ఇదేం ట్రెండ్ అండి బాబు.. అంటూ మండిపోతున్నారు..! సారీ…మీ హెయిర్‌స్టైల్ నాకు న‌చ్చ‌లేదని ఒకరు, ఇంట్లో ఆడుకుంటూ బాల్యంలో ఇలాంటి ప‌నులు చేశామ‌ంటూ మరొకరు కామెంట్‌ చేయగా, సీరియ‌స్‌గా ఇలాంటి ప‌నులు ఎప్పుడూ చేయ‌లేద‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు. ఆమె మేకప్ బాగానే ఉంది. కానీ ఆమె హెయిర్‌ స్టైలే పిచ్చిగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్‌ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ సందడి చేస్తోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే