Health Tips: గుర్రపు పప్పుగా పిలిచే ఈ ఆహారంతో ఎన్ని లాభాలో తెలుసా..? ఇది శక్తి, పోషకాలకు నిధి..!
వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల.. పక్షవాతం, నడుము నొప్పి, సయాటికా, కీళ్ల నొప్పుల వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే, షుగర్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు అంటున్నారు నిపుణులు.
ఉలవలు.. దీనినే గుర్రపు పప్పుగా పిలుస్తున్నారు. ఇది పోషకాల నిధి. ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు పరిగడుపున ఉడికించిన ఉలవలు తీసుకోవడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. శరీరం ఫిట్‌గా ఉంటుంది. పైల్స్, కిడ్నీలో రాళ్లు, కొలెస్ట్రాల్, అల్సర్ వంటి అనేక వ్యాధులను తరిమికొట్టే సామర్థ్యం ఉలవలకు ఉంది. ఉలవలను రెగ్యూలర్‌గా తీసుకునే వారు ఇతరులకన్నా బలంగా, ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఎదిగే పిల్లలకు ఉలువలు ఎంతో విలువైన ఆహారంగా చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల నీరసం, రక్తహీనత నుంచి బయట పడవచ్చు.ఇక పురుషుల్లో లైంగిక సామార్థ్యం పెంచే గుణం ఉలవలకు ఉందంటున్నారు.
ఉలవలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల ఉలవలలో 22 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది, ఇది ఊబకాయాన్ని అరికడుతుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. వీటిని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. స్త్రీలలో రుతుక్రమ సమస్యలు తగ్గించడంలో ఉలవలు ఎంతో ఉపయోగపడతాయి. స్త్రీలలో వచ్చే వైట్ బ్లీడింగ్ వంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఉలవలు తీసుకోవడం ఉత్తమ మార్గం అంటున్నారు నిపుణులు. తరచుగా ఉలవ చారును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల.. పక్షవాతం, నడుము నొప్పి, సయాటికా, కీళ్ల నొప్పుల వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు.
జ్వరంతో బాధపడేవారు ఉలవల కషాయాన్ని పెసరపప్పుతో కలిపి తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులతో పోరాడడంలో ఉలవలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. తద్వారా వ్యాధులు దూరమవుతాయి. కడుపు సమస్యలతో బాధపడేవారు కూడా ఉలవలు తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం పొందుతారు. ప్రతి రోజు 100 గ్రాముల ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పోషకాల లోపం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఉలవల కషాయాన్ని పాలల్లో కలుపుకుని తాగడం వల్ల నులి పురుగులు నశిస్తాయి.
పైల్స్ సమస్యతో బాధపడేవారికి ఉలవలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం ఉలవలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నిద్రలేవగానే ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల పైల్స్ నొప్పికి చాలా ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు, మల నాళాలలో వాపు కూడా తగ్గుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..